Ro-Co in B grade: బి గ్రేడ్ లో రో-కో
సోమవారం ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల జాబితాల్లో రో-కోను గ్రేడ్ ‘బి’లో చేర్చారు. బీసీసీఐ కేంద్ర కాంట్రాక్టుల్లో సూపర్ సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల గ్రేడ్‌లు తగ్గించారు.

బీసీసీఐ కేంద్ర కాంట్రాక్టులో మార్పులు
‘ఎ’ ప్లస్ విభాగాన్ని రద్దు చేసిన బోర్డు
న్యూఢిల్లీ: సోమవారం ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల జాబితాల్లో రో-కోను గ్రేడ్ ‘బి’లో చేర్చారు. బీసీసీఐ కేంద్ర కాంట్రాక్టుల్లో సూపర్ సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల గ్రేడ్‌లు తగ్గించారు.
‘ఎ’ ప్లస్ విభాగాన్ని రద్దు చేసిన బోర్డు…
ఏడు కోట్ల వేతనంతో కూడిన ‘ఎ’ ప్లస్ విభాగాన్ని బోర్డు రద్దు చేసింది. గ్రేడ్ ‘ఎ’, ‘బి’, ‘సి’ కేటగీరిలలో కలిపి మొత్తం 30 మంది పురుష క్రికెటర్లు, 21 మంది మహిళా క్రికెటర్లకు కాంట్రాక్టులు ఇచ్చింది.
గ్రేడ్ ‘ఎ’ ఆటగాళ్లకు ఐదు కోట్లు, ‘బి’ గ్రేడ్‌కు రూ. మూడు కోట్లు, ‘సి’ గ్రేడ్‌కు రూ. కోటి చెల్లించనున్నట్టు సమాచారం.
గ్రేడ్ ‘ఎ’ (రూ. 5 కోట్లు): శుభ్‌మన్ గిల్, బుమ్రా, రవీంద్ర జడేజా; గ్రేడ్ ‘బి’ (రూ. 3 కోట్లు): రోహిత్, విరాట్, సూర్యకుమార్, పంత్, హార్దిక్, జైస్వాల్, రాహుల్, సిరాజ్, కుల్దీప్, వాషింగ్టన్ సుందర్, శ్రేయాస్; గ్రేడ్ ‘సి’ (రూ. 1 కోటి): తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, వరుణ్, రింకూ సింగ్, శివమ్ దూబే, సంజూ శాంసన్, అర్ష్‌దీప్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, ఆకాశ్, ప్రసిద్ధ్, అక్షర్, సాయి సుదర్శన్
మహిళలు: గ్రేడ్ ‘ఎ’(రూ. 50 లక్షలు): హర్మన్ ప్రీత్, స్మృతి మంధాన, దీప్తీశర్మ, జెమీమా
గ్రేడ్ ‘బి’ (రూ. 30 లక్షలు): షఫాలీ, రిచా ఘోష్, రేణుకా సింగ్, స్నేహ్ రాణా
గ్రేడ్ ‘సి’ (రూ. 10 లక్షలు): శ్రీచరణి (తొలిసారి), కమలిని, ప్రతికా రావల్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, యాస్తికా భాటియా, క్రాంతి గౌడ్, తేజల్, అమన్‌జోత్, ఉమా ఛెత్రి, హర్లీన్, కశ్వీ గౌతమ్, వైష్ణవి శర్మ.



