రేవంత్ రెడ్డి.. తులం బంగారం ఎప్పుడు ఇస్తావ్..?
నెలకు రెండు వేలు, నాలుగు వేలు చేస్తామని, రెండున్నర వేలు ఇస్తామని, ఆరు గ్యారంటీలని, ఏదైతే మోసం జరిగిందో, దాన్ని మీరు నిలదీయకపోతే మళ్ళీ ఇప్పుడు తప్పిందంటే మళ్ళా ఇంకో మూడేళ్ళకే దొరుకుతారు మీకు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా మూడేళ్ళు అధికారంలో వాళ్ళే ఉంటారు.

నెలకు రెండు వేలు, నాలుగు వేలు చేస్తామని, రెండున్నర వేలు ఇస్తామని, ఆరు గ్యారంటీలని, ఏదైతే మోసం జరిగిందో, దాన్ని మీరు నిలదీయకపోతే మళ్ళీ ఇప్పుడు తప్పిందంటే మళ్ళా ఇంకో మూడేళ్ళకే దొరుకుతారు మీకు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా మూడేళ్ళు అధికారంలో వాళ్ళే ఉంటారని, ఇప్పుడు మీరు ఇంటింటికి వచ్చి అడిగేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళని అడుగుండ్రి, మరి ఏమయ్యా బిడ్డ ఎప్పటినుంచి ఇస్తావ్ రెండున్నర వేలు, మీరు రేవంత్ రెడ్డి అని చెప్పున్నాను, ఇక్కడుండే కాంగ్రెస్ నాయకులు అని చెప్పున్నాను, మాటీ ఇన్నాను అని అడుగుండ్రని సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
నెలకు 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావ్?
ఎప్పటినుంచి ఇస్తావ్ తులం బంగారం, ఎప్పటినుంచి ఇస్తావ్ నెలకు నాలుగు వేల పెన్షన్, మరి బీసీలకు చెప్తివి, ఎస్సీలకు చెప్తివి, కేసీఆర్ దళిత బంధు అని పెడితే, ఆయన ఇచ్చే పది లక్షలు ఏంది, నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు. అట్లా ఒక్కొక్కళ్ళకు ఒక్కో తీరు చెప్పిండు. బీసీలకైతే లక్ష కోట్ల బడ్జెట్ పెడతాం అన్నారు.
కేసీఆర్ లక్ష ఇట్టే నేను పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు. మరి ఇవాళ ఒక్క రూపాయి ఇచ్చింది లేదు, ఉన్నాయి తీసేసిండు. ఇక్కడ ఎవరికైనా గతంలో కేసీఆర్ కిట్ వచ్చినోళ్ళు ఉన్నారా? అని అడిగితే ప్రజలు లేదని సమాధానమిచ్చారు.
అన్నీ కేసిఆరే ఇచ్చిండు..
కేసీఆర్ కిట్ వచ్చినోళ్ళు చేయి లేవట్టు, వచ్చిందా? ఒక మాట ఇంటికాడ గర్భవతిని బండిలో ఎక్కించుకొని, దవాఖానకు తీసుకుపోయి అక్కడ ప్రసూతి అయిన తర్వాత ఆడపిల్ల పుడితే పదమూడు వేలు, మగ పిల్లవాడు పుడితే పన్నెండు వేలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందా ఇదివరకు? ఇందిరమ్మ, ఇంతకుముందున్న సోనియా అమ్మ ఎవరైనా ఇచ్చిర్రా? ఎవోళ్ళు ఇయ్యలే, కేసీఆర్ సార్ ఇచ్చిండన్నారు.
ఇవాళ ఉందా మరి అది, తీసి పారేసిండు. అది మంచి పథకమా, చెడ్డ పథకమా? మరి ఎందుకు తీయాలి? లేడీస్ కి ఇచ్చే పథకం తీయొచ్చా కేసీఆర్ పేరు ఉంటే, మార్స్కో పేరు మేము వద్దనమా? ఇందిరమ్మ కిట్ అని పెట్టుకో మేము వద్దనమా? కానీ కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ కిట్ తీసేసిండన్నారు.
కేసీఆర్ ఉన్నప్పుడు మీకు రంజాన్ తోఫా వస్తున్నాయి, యాదుకుంది ఆ చెల్లెలు వెనకాల ఉన్న మా ముస్లిం వాళ్ళ బిడ్డలు, వస్తుండేనా, ఇవాళ వస్తుందా రంజాన్ తోఫా? క్రిస్మస్ కు క్రిస్మస్ కానుక వస్తుండేయి, బతుకమ్మకు బతుకమ్మ చీర వస్తుండేయి. ఈసారి బతుకమ్మకు చీర పెట్టిండా రేవంత్ రెడ్డి, వచ్చినయా? కనీసం రైక పెట్టిండా, చీర లేదు, రైక లేదు, ఏమి లేదన్నాడు.
చీర పెట్టకపోయినా, రైక పెట్టకపోయినా ఫర్లేదనుకుంటాడు…
పోనీ ఉన్న బిజినెస్ ఏముందంటే అది నాశనం చేసిండు. మరి ఆయన గుద్దుకోవా, మరి కాంగ్రెస్ ఓట్లు… ఇదివరకు ఉన్న పిల్లల మీద కోపంతో మళ్ళా కాంగ్రెస్ ఓట్లు గుద్దుతే, రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు, అంటే నేను చీర పెట్టకపోయినా, రైక పెట్టకపోయినా, నాలుగు వేల పెన్షన్ ఇయ్యకపోయినా, నెలకు రెండున్నర వేలు ఇయ్యకపోయినా, చెప్పినట్టు స్కూటీ ఇయ్యకపోయినా, ఏమి ఇయ్యకపోయినా నాకే గుద్దుతుర్రు, ఫ్రీ బస్ కే గుద్దుతున్నారు. కాబట్టి నేను ఏమి ఇచ్చే అవసరం లేదు, ఏం కాదు నేను సప్పడే కిట్ లే ఉంటా, అనుకుంటాడా అనుకోడా? కాబట్టి కాంగ్రేస్ నాయకులను ఓడించాలని కోరారు.



