హుజుర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో R& B రహదారులకు మహర్దశ

హుజుర్ నగర్ , కోదాడ నియోజక వర్గాల రహదారులకు మహర్దశ పట్టింది. సింగిల్ రహాదారులుగా ఉన్న 49 కిలో మీటర్ల రహదారిని డబుల్ రోడ్లుగా చేసేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

49 కిలో మీటర్ల సింగిల్ రహదారులకు డబుల్ రోడ్ల ఏర్పాటుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

రూ 130 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

హుజుర్ నగర్ , కోదాడ నియోజక వర్గాల రహదారులకు మహర్దశ పట్టింది. సింగిల్ రహాదారులుగా ఉన్న 49 కిలో మీటర్ల రహదారిని డబుల్ రోడ్లుగా చేసేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర నీటిపారుదల & పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి లు పట్టుబట్టి సింగిల్ లైన్ రోడ్లను ను డబుల్ లైన్ రోడ్లు గా మార్చేందుకు చేసిన కృషి ఫలించింది.

ఇందుకు గాను పాలనా పరమైన అనుమతులతో పాటు ప్రభుత్వం ఏక కాలంలో మేజర్ డిస్ట్రిక్ రోడ్ ప్లాన్ (MDR) కింద 130 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

 

హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలో రూ.62 కోట్లతో…

హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలో రూ.62 కోట్లతో 26.50 KM ల పొడవున డబల్ రోడ్డు మంజూరు పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తద్వారా ఈ నియోజకవర్గంలో 15 గ్రామాలకు ప్రయాణ సౌకర్యం సులువుగా మారనుంది.

 

కోదాడ నియోజకవర్గ పరిధిలో రూ.68 కోట్లతో…

కోదాడ నియోజకవర్గ పరిధిలో రూ.68 కోట్లతో 22.60 KM ల పొడవున డబల్ రోడ్డు ఏర్పాటుకు పాలనాపరమైన అనుమతులు లభించాయి.

తద్వారా నియోజకవర్గంలోని 9 గ్రామాలకు రాక పోకలు సులువు కానున్నాయి.

 

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురనగర్, కోదాడ నియోజకవర్గాల పరిధి లోని సుమారు 49.10 KMల మేర సింగిల్ లైన్ రోడ్డును డబల్ లైన్ రోడ్డుగా మార్చేందుకు మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ ప్లాన్ (MDR) నిధుల ద్వారా రూ.130 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం నుండి మార్చి 5 న ఉత్తర్వులు జారీ చేసింది.

హుజూర్ నగర్ నియోజకవర్గంలో సింగిల్ లైన్ నుండి డబుల్ రోడ్డుకు మారేవి ఇవి..

రూ.32 కోట్లతో చింతలపాలెం నుండి కిస్టాపురం వరకు 9.20 KM ల మేర సింగిల్ లైన్ నుండి డబల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు.

దీనితో చింతలపాలెం, శోభనాద్రిగూడెం, అడ్లూరు, తమ్మారం, కొత్తూరు, కిస్టాపురం గ్రామ ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.

అదేవిధంగా రామలక్ష్మిపురం నుండి హుజూర్ నగర్ బైపాస్ రోడ్డు వరకు 3.80 KM ల మేర సింగిల్ లైన్ నుండి డబల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. దీనితో రామలక్ష్మిపురం, యర్రారం , హుజూర్ నగర్ ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.

రూ.30 కోట్లతో అమరవరం నుండి కొత్త తండ వరకు 5.50 KM ల మేర సింగిల్ లైన్ నుండి డబల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు.

దీనితో అమరవరం, అంజలిపురం తండ, కొత్తతండ ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. గుడుగుంట్ల పాలెం నుండి ఎల్లాపురం వరకు 8.00 KM ల మేర సింగిల్ లైన్ నుండి డబల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు.

దీనితో గుడుగుంట్ల పాలెం, ముసిఒడ్డు సింగారం, ఎల్లాపురం గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.

కోదాడ పరిధిలో….

కోదాడ నియోజకవర్గం పరిధిలో రూ.30 కోట్లతో కోదాడ నుండి అనంతగిరి వరకు 6.60 KMల మేర ఏడు మీటర్ల నుండి పది మీటర్ల మేర వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేయనున్నారు. దీనితో కోదాడ, ఖానాపురం, అనంతగిరి గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.

రూ.24 కోట్లతో NH9 నుండి నేలమర్రి వరకు 10.00 KMల మేర సింగిల్ లైన్ నుండి డబల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. దీనితో తాడ్వాయి తండ, తాడ్వాయి, వెంకట్రాంపురం, నేలమర్రి గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.

 

అదే విదంగా రూ.14 కోట్లతో కాపుగల్లు నుండి దోరకుంట వరకు 6.00 KMల మేర సింగిల్ లైన్ నుండి డబల్ లైన్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. దీనితో కాపుగల్లు, దోరకుంట ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబందిత అధికారులతో మాట్లాడుతూ తక్షణమే టెండర్లు పిలిచి యుద్ద ప్రాతిపదికన పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button