బాల్యవివాహాల నిర్మూలన రథయాత్ర ప్రారంభం

రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు చిన్నమ్మ తామస్
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో ఫిబ్రవరి 18 (నిజం చెపుతాం)
రూరల్ డెవలప్మెంట్ సొసైటీ మరియు జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సంస్థల ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలన రథయాత్ర కార్యక్రమాన్ని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ మరియు జిల్లా అదనపు ఎస్పి శంకర్
జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని సునంద మరియు రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు చిన్నమ్మ తామస్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2030 నాటికి జోగులాంబ గద్వాల జిల్లాలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలని కోరడం జరిగింది
దీనికి అధికారులు మరియు ప్రజలు సహకరించాలని జరిగింది. అదనపు ఎస్పీ శంకర్ మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే సమాజంలోని సామాజిక సమస్యలు అంతమవుతాయని పేర్కొన్నారు.రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు చిన్నమ్మ తామస్ మాట్లాడుతూ బాల్య వివాహ నిర్మూలన రథయాత్ర 10 రోజులపాటు జిల్లాలోని వివిధ గ్రామాలలో తిరిగి ప్రచారం చేస్తుందని తెలిపారు .
అనంతం కలెక్టర్ మరియు అదనపు ఎస్పీ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా రూపొందించిన పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా రూపొందించిన బ్యానర్లపై సిగ్నేచర్ చేశారు, చివరగా బాల్యవివాహాలకు వ్యతిరేకంగా జిల్లా అధికారులు అందరితో కలిసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
అనంతరం బాల్య వివాహ నిర్మూలన రథయాత్రను కలెక్టరేట్ కార్యాలయ గేట్ వరకు ర్యాలీగా చేరుకున్నారు.



