RANJI TROFI FINAL : 67 ఏండ్ల నిరీక్షణకు తెర…రంజీ ట్రోఫీ విజేతగా జమ్మూ కశ్మీర్
RANJI TROFI FINAL :కర్ణాటకతో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ను జమ్మూ కశ్మీర్ జట్టు డ్రా ముగించింది. దీంతో తొలి ఇన్నింగ్స్ అధికం సాధించిన జట్టుగా జమ్మూ కశ్మీర్ జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా శుభమ్ పుందిర్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ అకిబ్ నబీ ఎంపికయ్యారు.

RANJI TROFI FINAL : నిత్యం తుపాకుల, బాంబుల మోతలు మోగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో శనివారం టపాసులు పేలుతున్నాయి. ఎందుకంటే ఆ జట్టు రంజీ ట్రోఫీని ముద్దాడటానికి 67 సంవత్సరాలు పట్టింది.
కర్ణాటకతో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ను జమ్మూ కశ్మీర్ జట్టు డ్రా ముగించింది. దీంతో తొలి ఇన్నింగ్స్ అధికం సాధించిన జట్టుగా జమ్మూ కశ్మీర్ జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా శుభమ్ పుందిర్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ అకిబ్ నబీ ఎంపికయ్యారు.
ఓవర్ నైట్ 186/4 స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జమ్మూ కశ్మీర్ 342/4 వికెట్లకు డిక్లేర్ చేసింది. మరొక్క సెషన్ ఆట మాత్రమే ఉండటంతో ఇరుజట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.
ఈ ఇన్నింగ్స్ లో ఖమ్రాన్ ఇక్బాల్ (160 నాటౌట్), సాహిత్ లోత్రా (101 నాటౌట్)లు సెంచరీలను సాధించారు.
తొలి ఇన్నింగ్స్ లో జమ్మూ కశ్మీర్ 584 పరుగులు చేయగా, కర్ణాటక 293 పరుగులకు అలౌట్ అయింది.



