ఓపెన్ ఐస్ సొసైటీ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా..!
మదర్సా విద్యార్థులకు 25 కేజీల బియ్యంతో పాటు రంజాన్ సరుకుల పంపిణీ..!

రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఓపెన్ ఐస్ సొసైటీ అండగా నిలిచింది. బుధవారం సీతారాం నగర్‌లోని మదీనా మసీదు ఉర్దూ మదర్సా విద్యార్థులకు మరియు పలు పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మదర్సా విద్యార్థులకు 25 కేజీల బియ్యంతో పాటు రంజాన్ సరుకులను అందజేశారు. అలాగే మరో మూడు పేద కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 కేజీల చొప్పున బియ్యం, పండుగ సామగ్రిని పంపిణీ చేశారు.
సందర్భంగా సొసైటీ ప్రతినిధి సులువ శ్రీను మాట్లాడుతూ”ముస్లిం సోదరులు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మా సొసైటీ తరఫున ఈ చిన్న సాయం చేశాం. మొత్తం 100 కేజీల బియ్యంతో పాటు సేమియా, ఖర్జూరం, చక్కెర వంటి పండుగకు అవసరమైన సరుకులను అందజేశాం” అని తెలిపారు.
ఈ సేవా కార్యక్రమంలో సొసైటీ సభ్యులు షేక్ అబ్దుల్ మజీద్, కొడిమెల లక్ష్మణ్, పిల్లి శివశంకర్, దగ్గుబాటి రమేష్, శీలం అశోక్, షేక్ సైదా తదితరులు పాల్గొన్నారు.



