హుజూర్ నగర్ ‘మోడల్ కాలనీ’ ఇళ్ల కేటాయింపుపై వెల్లువెత్తుతున్న నిరసనలు..!

అద్దె ఇంట్లో ఉండేవారికే ప్రాధాన్యత ఇచ్చామని అధికారులు చెబుతున్నా, అసలు కథ వేరేలా ఉంది. జాబితాలో పేరున్న వారిలో చాలామందికి ఇప్పటికే సొంత ప్లాట్లు, పొలాలు ఉన్నాయని, అవి వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి

*సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లపై పారదర్శకత ఎక్కడ*..?

*మంత్రి ఆదేశాలు బేఖాతర్*..?

*అధికారుల నిర్లక్ష్యం లో నిజమెంత*..?

*అధికారులకు పదేపదే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన మంత్రి*..!

*మంత్రి ఉత్తమ్ స్పందనపైనే అందరి కళ్లు*..!

హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని ఫణిగిరి గుట్ట వద్ద నిర్మించిన మోడల్ కాలనీ ఇళ్ల కేటాయింపు వ్యవహారం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.

శనివారం అధికారులు 805 మంది లబ్ధిదారులతో కూడిన డ్రాట్ జాబితాను విడుదల చేసినప్పటికీ, అందులో అసలైన నిరుపేదలకు చోటు దక్కలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 

ఎలాంటి పైరవీలకు తావులేకుండా, కేవలం అర్హులైన పేదలకే ఇళ్లు అందాలి” అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు పదేపదే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. 360 డిగ్రీల కోణంలో విచారణ చేశామని అధికారులు చెబుతున్న మాటలకు, విడుదలైన జాబితాకు పొంతన లేదని స్థానికులు మండిపడుతున్నారు.

 

అద్దె ఇంట్లో ఉండేవారికే ప్రాధాన్యత ఇచ్చామని అధికారులు చెబుతున్నా, అసలు కథ వేరేలా ఉంది. జాబితాలో పేరున్న వారిలో చాలామందికి ఇప్పటికే సొంత ప్లాట్లు, పొలాలు ఉన్నాయని, అవి వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి.

పారదర్శకంగా డ్రాఫ్ట్ నిర్వహించకుండానే జాబితా ఎలా సిద్ధం చేశారనేది ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఏళ్ల తరబడి అద్దె ఇళ్లలో ఉంటూ, రూపాయి రూపాయి కూడ బెట్టుకుంటున్న నిజమైన పేదలకు మొండిచేయి ఎదురైందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

*మంత్రి ఉత్తమ్ స్పందనపైనే అందరి కళ్లు*..!

 

అర్హులకే న్యాయం జరగాలని కోరుకునే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారుల ఈ నిర్లక్ష్యపు తీరుపై ఎలా స్పందిస్తారో చూడాలి. తక్షణమే శనివారం విడుదల చేసిన జాబితాను రీ-వెరిఫికేషన్ చేసి, అక్రమంగా ఇళ్లు పొందిన వారిని తొలగించాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button