పాఠాల కంటే ప్రాక్టికల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత..? 60 శాతం వెయిటేజ్..!

ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా సిలబస్‌ను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయం..!

రాష్ట్రంలోని ఉన్నత విద్యలో సమూల మార్పులకు ఉన్నత విద్యామండలి శ్రీకారం చుట్టింది. డిగ్రీ కోర్సులను కేవలం థియరీ పాఠాలకే పరిమితం చేయకుండా, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా సిలబస్‌ను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించింది.

ఉద్యోగ నైపుణ్యాలే లక్ష్యం: విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసిన వెంటనే నేరుగా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా సిద్ధంగా ఉండేలా చేయడమే ఈ మార్పుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. ఇకపై కోర్సుల్లో 50 నుండి 60 శాతం ప్రాధాన్యత ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రీ అప్రెంటిస్‌షిప్ మరియు నైపుణ్యాభివృద్ధికి కేటాయించనున్నారు.

ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా వివిధ సంస్థలతో విద్యామండలి ఒప్పందాలు చేసుకోనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుండే ఈ మార్పులు అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల నిరుద్యోగ సమస్య తగ్గడమే కాకుండా, విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button