కాబూల్ ఆస్పత్రిపై పాక్ వైమానిక దాడి: 400 మంది మృతి..?
తాజా నివేదికల ప్రకారం 400 మంది మరణించగా, 250 మందికి పైగా గాయపడ్డారు

కాబూల్ ఆస్పత్రిపై పాక్ వైమానిక దాడి: 400 మంది మృతి..?
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ‘ఒమర్ అడిక్షన్ ట్రీట్మెంట్’ ఆస్పత్రిపై సోమవారం రాత్రి పాకిస్థాన్ వైమానిక దాడులు చేసింది.
ఈ దాడిలో ఆస్పత్రి భవనం పూర్తిగా ధ్వంసమై భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. తాజా నివేదికల ప్రకారం 400 మంది మరణించగా, 250 మందికి పైగా గాయపడ్డారు.
మరణించిన వారిలో చికిత్స పొందుతున్న రోగులే ఎక్కువగా ఉన్నారు. రంజాన్ మాసంలో జరిగిన ఈ దాడిపై అంతర్జాతీయంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
అఫ్గాన్ దీనిని ‘మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరం’గా అభివర్ణిస్తుండగా.. తాము కేవలం ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని పాకిస్థాన్ పేర్కొంటోంది.



