ఉల్లి ధరలు ధమాల్.. తెలుగు రాష్ట్రాల్లో కేజీ రూ. 10 కంటే తక్కువకే..!
గత నెల వరకు రూ. 40-50 పలికిన ఉల్లి, ఇప్పుడు..?

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా పతనమయ్యాయి. మార్కెట్‌కు పోటెత్తిన దిగుబడితో సామాన్యుడికి భారీ ఊరట లభిస్తుండగా, రైతులకు కన్నీళ్లు మిగులుతున్నాయి.
ప్రధాన మార్కెట్లలో (హైదరాబాద్‌లోని బోయినపల్లి, గుడిమల్కాపూర్ వంటి చోట్ల) ఉల్లి కేజీ రూ. 9.50 నుండి రూ. 12 మధ్య పలుకుతోంది.క్వింటాల్ సగటు ధర రూ. 950 కి పడిపోయింది. కొన్ని చోట్ల కనిష్టంగా రూ. 700 కే విక్రయిస్తున్నారు.
మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుండి రికార్డు స్థాయిలో స్టాక్ రావడం, స్థానికంగానూ దిగుబడి పెరగడం.పెట్టుబడి కూడా రావడం లేదని, రవాణా ఖర్చులు భరించలేక పంటను రోడ్లపైనే వదిలేస్తున్నామని రైతులు వాపోతున్నారు.
గత నెల వరకు రూ. 40-50 పలికిన ఉల్లి, ఇప్పుడు పది రూపాయలకే దొరుకుతుండటంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



