మాడ్గులలో పెద్దవాగును కబ్జా చేస్తున్న సమీప రైతులు
మండల కేంద్రమైన మాడ్గుల గ్రామం నుంచి కలకొండ వెళ్ళే రహదారిలో పెద్దవాగును సమీప రైతుల నుంచి కొనుగోలు చేసిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కబ్జా చేశాడని గ్రామస్తులు విమర్శలు గుప్పిస్తున్నారు.

మాడ్గులలో పెద్దవాగును కబ్జా చేస్తున్న సమీప రైతులు
కాపాడాలని తాసిల్దార్ కు వినతి…
మాడ్గుల ఫిబ్రవరి 16(నిజం చెపుతాం): మండల కేంద్రమైన మాడ్గుల గ్రామం నుంచి కలకొండ వెళ్ళే రహదారిలో పెద్దవాగును సమీప రైతుల నుంచి కొనుగోలు చేసిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కబ్జా చేశాడని గ్రామస్తులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ పెద్దవాగులో వాటర్ షెడ్ నిధుల నుంచి చెక్ డాం సైతం నిర్మించగా ఇది నా వ్యవసాయ పొలంలోకి వస్తుందని ఖడీలు సైతం పాతిన రెవెన్యూ అధికారులు గానీ ఇరిగేషన్ అధికారులు గాని పట్టించుకోకపోవడం పట్ల గ్రామానికి చెందిన ప్రజా ప్రతినిధులు అధికారుల తీరుపై విమర్శలు గుప్పించడం గమనార్హం.
రియల్ ఎస్టేట్ వ్యాపారి వాగును కబ్జా చేయడంతో పాటు ఆ వాగులో అండర్ డ్రైనేజీ నిర్మాణం కలపకుండా అడ్డుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయంపై సంబంధిత రెవెన్యూ అధికారులు చొరవ చూపి వాగు కబ్జాపై చర్యలు తీసుకోవడంతో పాటు భూగర్భ మురుగు కాలువల నిర్మాణం పనులకు అడ్డుపడుతున్న ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై, కబ్జా చేస్తున్న పరిసర రైతులపై చర్య తీసుకోవాలని గ్రామస్తులు తాసిల్దార్ వినయ్ సాగర్ దృష్టికి తీసుకుపోయినట్లు సమాచారం.



