ప్రకృతి వ్యవసాయంతో మిత్ర పురుగులను రక్షించుకోవచ్చు

జీవ నియంత్రణ పద్ధతులలో భాగంగా జీవ శలింద్ర నాశినులైన ట్రైకోడెర్మా, సూడోమోనాస్ వాడినచో అన్ని రకాల తెగుళ్ల నుంచి నివారించుకోవచ్చు. అలాగే బవేరియా బసియానా మరియు వర్టిసిలియంల కానీ పిచికారి చేసినట్లయితే అన్ని రకాల పురుగుల నుంచి సమర్థవంతంగా నివారించుకోవచ్చని వివరించారు.

ప్రకృతి వ్యవసాయంతో నేల మరియు వాతావరణంలోని మిత్ర పురుగులను పరిరక్షించుకోవచ్చు

గరిడేపల్లి ఫిబ్రవరి 4 (నిజం చెపుతాం)

కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి & జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐదు రోజుల ప్రకృతి వ్యవసాయంపై కృషి సఖీల శిక్షణ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు గడ్డిపల్లి మృతిక శాస్త్రవేత్త ఎ.కిరణ్ రైతులకు వివిధ ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇచ్చారు.

బుధవారం రోజు శిక్షణలో భాగంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా నేలసారం పెంచడానికి పశువుల ఎరువుల యొక్క ప్రాముఖ్యత, వర్మి కంపోస్ట్ తయారీ, వర్మీవాష్ తయారీ & పంటలకు వాడే విధానం, అజోల్లా పెంచే విధానం, వ్యవసాయానికి పశువులకు మేతగా వాడే విధానాలు, ప్రకృతి వ్యవసాయం ఉత్పత్తులను సర్టిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, మర్కెటింగ్ చెసే పద్దతల పై రైతులకు వివరించారు.

పురుగులు మరియు తెగుళ్ల యాజమాన్యం పై కే.వి కే – గడ్డిపల్లి సస్య రక్షణ శాస్త్రవేత్త డి ఆదర్శ్ వివరించారు. పత్తి, కంది, మిర్చి, కూరగాయల పంటలలో తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగులకు మూడు రంగుల జిగురు అట్టలను (పసుపు, నీలం, తెలుపు) అమర్చుకోవడం, 1500 పిపిఎం వేప నూనె పిచికారి చేయడం చేసుకోవాలి.

రెక్కల పురుగుల యాజమాన్యానికై ఎకరానికి 4 లింగకర్షక బుట్టలను అమర్చుకోవడం గురించి తెలిపారు. అలాగే పొలం లో ఎకరానికి అమార్చుకోవాల్సిన ఒక సోలార్ దీపపు ఎర గురించి తెలిపారు.

జీవ నియంత్రణ పద్ధతులలో భాగంగా జీవ శలింద్ర నాశినులైన ట్రైకోడెర్మా, సూడోమోనాస్ వాడినచో అన్ని రకాల తెగుళ్ల నుంచి నివారించుకోవచ్చు. అలాగే బవేరియా బసియానా మరియు వర్టిసిలియంల కానీ పిచికారి చేసినట్లయితే అన్ని రకాల పురుగుల నుంచి సమర్థవంతంగా నివారించుకోవచ్చని వివరించారు.

ఈ కార్యక్రమంలో డీపిడీ ఆత్మ శ్రీమతి జి. నివేదిత, వ్యవసాయ అధికారులు శ్రీ కె. మల్లారెడ్డి, శ్రీమతి బి. భువనేశ్వరి, కేవీకే శాస్త్రవేత్తలు మరియు 30 మంది రైతులు కృషి సఖీలు పాల్గొన్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button