మున్సిపాలిటీ..నిబంధనలు ‘గాలికి’.. ఫ్లెక్సీలు ‘మలుపులకి..!

అడ్డగోలుగా వెలుస్తున్న ఫ్లెక్సీలను మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రధానంగా యూటర్న్‌ల వద్ద ఈ భారీ హోర్డింగ్‌ సైజులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వాహనదారుల దృష్టిని మళ్లించడమే కాకుండా, ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకుండా మృత్యుపాశాలుగా మారుతున్నాయి.

*ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు*..?

 

హుజూర్ నగర్ పట్టణంలో నిబంధనలు తుంగలో తొక్కారు. మలుపుల వద్ద ప్రమాద సూచికలు పెట్టడం మరిచిన మున్సిపల్ అధికారులు..

అడ్డగోలుగా వెలుస్తున్న ఫ్లెక్సీలను మాత్రం పట్టించుకోవడం లేదు.

ప్రధానంగా యూటర్న్‌ల వద్ద ఈ భారీ హోర్డింగ్‌ సైజుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వాహనదారుల దృష్టిని మళ్లించడమే కాకుండా, ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకుండా మృత్యుపాశాలుగా మారుతున్నాయి.

“ప్రమాదం జరిగి ప్రాణం పోయాక స్పందిస్తారా?” అని పట్టణ ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం మానేసి, తక్షణమే ఆ ఫ్లెక్సీలను తొలగించాలని వాహన చోదకులు డిమాండ్ చేస్తున్నారు.

పట్టణంలో యూటర్న్‌ల వద్ద అడ్డుగా ఉన్న భారీ రాజకీయ, ప్రచార ఫ్లెక్సీలు వెలవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక నిత్యం తృటిలో తప్పుతున్న ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మలుపుల వద్ద ఫ్లెక్సీలు తొలగించి ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని వాహన చోదకులు కోరుతున్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button