మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి
మున్సిపల్ ఎన్నికలలో పూర్తిగా పారదర్శకంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పూర్తి సన్నద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ తెలిపారు

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
ఫిబ్రవరి 5( నిర్మల్ జిల్లా ప్రతినిధి నిజం చెపుతాం)
ఎన్నికలవేళ మద్యం నగదు పంపిణీకి తావులేదు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపిఎస్ మున్సిపల్ ఎన్నికలలో పూర్తిగా పారదర్శకంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పూర్తి సన్నద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ తెలిపారు
ప్రజలు ఎలాంటి భయ ఆందోళనలనులు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన భద్రత చర్యలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు సమస్య ఆత్మక పోలింగ్ కేంద్రాలు సున్నిత ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు ఎన్నికల సమయంలో గొడవలు ఘర్షణలకు ఆస్కారం లేకుండా ముందస్తుగా రౌడీ షీటర్ లను పాత నేరస్తులు అసాంఘిక శక్తులపై నిరంతర నిఘ కొనసాగించాలని అవసరమైన చోట బైండోవర్ కేసులు నమోదు చేసి ఆయుధాల అప్పగింత (వెపన్స్ డిపాజిట్) ప్రక్రియలు కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు
ఎన్నికల సమయంలో మద్యం నగదు ఇతర విలువైన వస్తువుల పంపిణీ ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు
ఈ తరహా అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటావని హెచ్చరించారు చెక్ పోస్ట్ ల వద్ద నిరంతర తనిఖీలు నిర్వహించి అక్రమ నగదు మద్యం రవాణాలు అడ్డుకోవాలని అధికారులను ఆదేశించారు
పోలింగ్ కేంద్రాల వద్ద తగిన భద్రత ఏర్పాట్లు ఉండాలని ముఖ్యంగా మహిళలు వృద్ధులు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు
ఎన్నికల కోడ్ ను కచ్చితంగా అమలు చేయాలని కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్ని పోలీస్ విభాగాలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో శాంతిభద్రతలు కాపాడాలని స్పష్టం చేశారు



