సెప్టెంబర్ నాటికి ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ ఎత్తిపోతల పధకం పూర్తి

ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ పూర్తి అయితే ఈ ప్రాంత రైతాంగానికి వ్యవసాయనికి పెద్ద గేమ్ చెంజర్ గా నిలుస్తోందన్నారు. ఇది పూర్తి అయితే మెల్లచేరువు, మఠంపల్లి మండల పరిధిలోని 53 వేల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందుతుందన్నారు.

-మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

సెప్టెంబర్,2026 నాటికి ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ ఎత్తిపోతల ప ధకం పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

తద్వారా వచ్చే రబీ సీజన్ కు ముందే ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందిస్తామని ఆయన వెల్లడించారు.

గురువారం రోజున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ ను సందర్శించి పనులు పరిశీలించారు.

ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ పూర్తి అయితే ఈ ప్రాంత రైతాంగానికి వ్యవసాయనికి పెద్ద గేమ్ చెంజర్ గా నిలుస్తోందన్నారు.

ఇది పూర్తి అయితే మెల్లచేరువు,
మఠంపల్లి మండల పరిధిలోని 53 వేల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందుతుందన్నారు.

అటువంటి ప్రాజెక్టు పూర్తి అయితే నేరుగా19,295 మంది రైతులకు లబ్దిచేకూరుతుందనిఆయన తెలిపారు.

ఒక్క మఠంపల్లి మండల పరిధిలోనే 20,466 ఎకరాల ఆయకట్టుకు చెందిన 2,540 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.

ఈ ప్రాజెక్టు కోసం 191 ఎకరాల భూసేకరణ నిర్వహించి సంబంధిత భూయజమానులకు 56 కోట్ల నష్టపరిహారం చెల్లించినట్లు ఆయన తెలిపారు.

మెల్లచేరువు మండలంలో 17,829 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.

పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆయాన సూచించారు.

నిరంతర నీటి సరఫరా కోసం ఇక్కడ 132/11 కే. వి సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button