మోడల్ హౌసింగ్ కాలనీ చరిత్రలో నిలిచి పోనుంది..మంత్రి ఉత్తమ్

హుజూర్నగర్ లో నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీలో స్థానికులకే అదీ అర్హులైన నిరుపేదలకు మాత్రమె కేటాయింపులు ఉంటాయని ఆయన సుస్పష్టం చేశారు.

అర్హులైన నిరుపేదలకు గృహ వసతి
ఆహార భద్రతకు పెద్దపీట
సంక్షేమ రంగంలో అద్భుతమైన ప్రగతి
ప్రారంభోత్సవానికి సిద్ధంగా
హుజూర్నగర్ లో మోడల్ హౌసింగ్ కాలనీ
-మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ గృహ వసతి కల్పించాలి అన్నదే ప్రభుత్వ దృఢ సంకల్పమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

అదే సమయంలో ఆహారభద్రతకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన చెప్పారు

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో తాను హౌసింగ్ మంత్రిగా ఉన్నప్పుడు హుజుర్నగర్ లో మొదలు పెట్టిన మోడల్ హౌసింగ్ కాలనీ మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే పూర్తి అయ్యి ప్రారంబోత్సవానికి సిద్డంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

మార్చి రెండోవారంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మోడల్ హౌసింగ్ కాలనీని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.

హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోనీ సుప్రసిద్ధ రామస్వామి గుట్ట సమీపంలో 110 ఎకరాలలో 125 కోట్లతో నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని గురువారం సాయంత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్షించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూపెద,బడుగు,బలహీన వర్గాల సొంతింటి కల సాకారం చేసేందుకు క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తాను గృహ నిర్మాణా శాఖామంత్రి గా ఉన్నప్పుడు 2,160 ఇండ్లతో మోడల్ కాలనీని 2011లో ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం నాటికి నిర్మాణ పనులు 2014 నాటికి తుది దశకు చేరుకున్నాయని ఆ తరువాత వచ్చిన బి.ఆర్.ఎస్ పాలకులు డబుల్ బెడ్ రూమ్ పేరుతో అధికారంలోకి వచ్చి ఈ మోడల్ హౌసింగ్ కాలనీని నిర్లక్ష్యం చేశారని ఆయాన మండిపడ్డారు.

మోడల్ హౌసింగ్ కాలనీని నిర్లక్ష్యం చేయాడమే కాకుండా ఈ ప్రాంతాన్ని డంపింగ్ యార్డ్ గా మార్చిన దుస్థితి బి.ఆర్.ఎస్ పాలకులకే చెల్లిందని ఆయన దుయ్యబట్టారు.

దశాబ్దకాలం తరువాత తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తాను మంత్రి పదవి చెపుట్టాక మోడల్ హౌసింగ్ కాలనీని పూర్తి చేయాలన్న లక్ష్యంతో నిధులు మంజూరు చేయించి పనులు త్వరితగతిన పూర్తి చేయిస్తున్న విషయాన్నీ ఆయన గుర్తు చేశారు.

మంత్రి వర్గ సభ్యుడిగా తాను ఎన్ని పనుల వత్తిడిలో ఉన్నా ఇక్కడి మోడల్ హౌసింగ్ కాలనీని పూర్తి చేసేందుకు అహోరాత్రులు అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తేనే ఈ కాలనీ ప్రారంబోత్సవానికి సిద్ధం చేశామన్నారు.

నేను మానస పుత్రికగా భావిస్తున్న మోడల్ హౌసింగ్ కాలనీ పూర్తి కావడం నాకు తీరని సంతృప్తినిచ్చిందని దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గానికి కేటాయింపులలో బాగంగా మరో 3,500 ఇళ్ళు మంజూరు కావడంతో మొత్తం హుజుర్నగర్ నియోజకవర్గంలో 5,660 ఇళ్లతో నియోజకవర్గంలోని అర్హులైన నిరుపేదలందరికీ గృహ వసతి లభిస్తుందన్నారు.

అయితే హుజూర్నగర్ లో నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీలో స్థానికులకే అదీ అర్హులైన నిరుపేదలకు మాత్రమె కేటాయింపులు ఉంటాయని ఆయన సుస్పష్టం చేశారు.

వాస్తావానికి మోడల్ హౌసింగ్ కాలనీ కొరకు సేకటించిన 110 ఎకరాల భూమి దేవాదాయా ధర్మాదాయ శాఖకు చెందినదని అప్పటి మార్కెట్ ధరకు అనుగుణంగా ఆ మొత్తాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెల్లించి కొనుగోలు చేసినట్టు ఆయన వివరించారు.

ప్రస్తుతం ఇక్కడ ఎకరం ఒక్కింటికి కోటి రూపాయలు ఉంటుందని, అంటే ప్రస్తుతం ఉన్న భూమి ధరను మినహాఇస్తే ఒక్కో ఇంటికి 6.5 లక్షలు ఉంటుందన్నారు.

317 చదరపు అడుగుల విస్తీర్ణంలో సింగిల్ బెడ్ రూమ్, విశాలంగా బాత్రూం సౌకర్యవంత గా వంట గదితో ఇక్కడ నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీ చరిత్రలోనే ఒక రోల్ మోడల్ గా నిలుస్తోందన్నారు.

ఎదో మొక్కుబడిగా కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ,24 గంటల సురక్షితమైన నీటి సరఫరా,విద్యుద్దికరణ, ఆధునిక పాఠశాల, పార్క్,కమ్యూనిటీ సెంటర్ వంటి పూర్తి మౌలిక సదుపాయాలతో 2160 కుటుంబాలకు వసతి కల్పించ నున్న ఈ మోడల్ హౌసింగ్ కాలనీలో కేటాయింపులు పూర్తిగా పారదర్శకంగా ఉంటాయన్నారు.

అందుకోసం ఆర్.డి.ఓ అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్, యం.పి.డి.ఓ సబ్యులుగా కమిటీ వేసినట్లు ఆయన తెలిపారు.

అందులో మొదటి దశలో 1000 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఇప్పటికే 95% పనులు మేర పూర్తి అయ్యాయని వాటిని కుడా త్వరితగతిన పూర్తి చేయించి లబ్ధిదారులకు కేటాయింపులు ఉంటాయని ఆయన వివరించారు.

అటువంటి మోడల్ హౌసింగ్ కాలనీ ప్రారంభోత్సవం రోజున లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలసి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆహార భద్రతకు పెద్ద పీట వేస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button