కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
అమ్మవారిని అత్యంత ఆరాధిస్తాననీ,రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కనకదుర్గ అమ్మవారిని ప్రార్ధించినట్లు మంత్రి పేర్కొన్నారు.

విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్న మంత్రి
ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల ఫిబ్రవరి 28 (నిజం చెపుతాం, రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డి):- శనివారం నాడు వేకుమ జామున విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ, ప్రసాదాలు మంత్రికి అందజేసి ఆశీర్వదించారు.ఆలయ అధికారులు,పాలక మండలి సభ్యులు అమ్మవారి జ్ఞాపిక,శాలువాతో మంత్రిని సత్కరించారు.
అమ్మ వారి దర్శనానికి వచ్చిన పలువురు తెలుగు రాష్ట్రాల భక్తులు మంత్రితో సెల్ఫీలు,ఫోటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు.
వారికి అభివాదం చేస్తూ మంత్రి ముందుకు సాగారు. తాను అమ్మవారిని అత్యంత ఆరాధిస్తాననీ,రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కనకదుర్గ అమ్మవారిని ప్రార్ధించినట్లు మంత్రి పేర్కొన్నారు.
మంత్రి వెంట ఆదిభట్ల మున్సిపల్ మాజీ ఛైర్మన్ నిరంజన్ రెడ్డి,పలువురు స్థానిక నేతలు ఉన్నారు.



