అనారోగ్యంతో ఉన్న మహిళకు KSR ఫౌండేషన్ ఆర్థిక భరోసా.
తక్షణ సహాయంగా ₹5,000 నగదు..!

హుజూర్ నగర్ మున్సిపాలిటీలోని అంబేద్కర్ కాలనీకి చెందిన భారతి అనే నిరుపేద మహిళ అనారోగ్యం బారిన పడటంతో KSR ఫౌండేషన్ – దిల్ యువసేన సభ్యులు మానవత్వంతో స్పందించారు.
కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించే ఆమె దీనస్థితిని చూసి చలించిన ఫౌండేషన్ సభ్యులు, తక్షణ సహాయంగా ₹5,000 నగదును ఆమెకు అందజేశారు. భవిష్యత్తులోనూ భారతికి అండగా ఉంటామని ఫౌండేషన్ ప్రతినిధులు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కస్తాల దిల్, గోపాల దాస్ కిరణ్, పి. అశోక్ యాదవ్, షేక్ రహీం, గల్లా సైదులు, గణేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.



