సూర్య పై కపిల్ దేవ్ ఫైర్!
భారత్ ఆటపై మాజీ పేస్ బౌలర్, భారత దిగ్గజ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు

టీ 20 వరల్డ్ కప్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా, దక్షిణాప్రికా చేతిలో ఊహించని భారీ తేడాతో ఓడి పోయి డీలా పడింది.
ఈ ఓటమిపై, భారత్ ఆటపై మాజీ పేస్ బౌలర్, భారత దిగ్గజ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
టి20 వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్లలో రన్ రేట్ (NRR) ఎంత ముఖ్యమో కెప్టెన్ సూర్యకు ఎవరూ చెప్పలేదా?
మ్యాచ్ ఓడిపోతే పర్వాలేదు, కానీ ఇంత భారీ తేడాతో ఓడిపోతే టోర్నీపై దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది” అని కపిల్ దేవ్ ఘాటుగా విమర్శించారు.
భారీ అంచనాలతో బరిలోకి దిగిన జట్టు ఇలా ఒక్కసారిగా చతికిలపడటం అభిమానులను సైతం తీవ్రంగా నిరాశపరుస్తోంది.
కపిల్ దేవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
మరి సూర్య సేన తదుపరి మ్యాచ్‌లలో తమ తప్పులను సరిదిద్దుకుని ఎలా ముందుకు పోతుందో చూడాలి.



