JEE Mains ఫలితాలు విడుదల
JEE Mains సెషన్ 1 జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జనవరి 21, 22, 23, 24, 28 మరియు 29, 2026 తేదీలలో జరిగింది. పేపర్ I పరీక్ష జనవరి 21, 22, 23, 24 మరియు 28, 2026 తేదీలలో రెండు షిఫ్ట్‌లలో జరిగింది - మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు. పేపర్ 2 చివరి తేదీన ఒకే షిఫ్ట్‌లో జరిగింది - ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగింది.

JEE మెయిన్స్ NTA సోమవారం సాయంత్రం JEE మెయిన్స్ 2026 ఫలితాలను విడుదల చేసింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫిబ్రవరి 16న JEE మెయిన్ ఫలితాలను ప్రకటించింది. సెషన్ 1 కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌కు హాజరైన అభ్యర్థులు NTA JEE అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in లో ఫలితాలను చూడవచ్చు. తుది సమాధాన కీని ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేశారు.
ఫలితాలను సెర్ఛ్ చేయండిలా.
Jeemain.nta.nic.in వద్ద NTA JEE అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Home పేజీలో “సెషన్ 1 కోసం Jeemain.nta.nic.in లింక్‌పై క్లిక్ చేయండి.
అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేయడంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
దరఖాస్తు నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ మరియు సెక్యూరిటీ పిన్‌ను నమోదు చేయండి.
Enter పై క్లిక్ చేయండి
కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ప్రింట్ అవుట్‌లను తీసుకోండి. ఇది కౌన్సెలింగ్, అడ్మిషన్ సమయంలో అవసరం అవుతుంది.
పరీక్ష ఎప్పుడు జరిగింది
సెషన్ 1 జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జనవరి 21, 22, 23, 24, 28 మరియు 29, 2026 తేదీలలో జరిగింది. పేపర్ I పరీక్ష జనవరి 21, 22, 23, 24 మరియు 28, 2026 తేదీలలో రెండు షిఫ్ట్‌లలో జరిగింది – మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు. పేపర్ 2 చివరి తేదీన ఒకే షిఫ్ట్‌లో జరిగింది – ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగింది.
JEE మెయిన్స్ తాత్కాలిక సమాధాన కీ ఫిబ్రవరి 4, 2026న విడుదలైంది. అభ్యంతరాలు తెలపడానికి ఫిబ్రవరి 6, సమయం కేటాయించారు.