ఎన్నికల కారణంగా రెండు విడతలుగా  ఐపీఎల్…RCB తో తొలి మ్యాచ్ ఆడనున్న SRH

పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మ్యాచ్‌ల తేదీలు ఎన్నికలతో ఇబ్బంది లేకుండా చూసేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

నేడు తొలి 20 రోజుల షెడ్యూల్ విడుదల

ఆర్ సి బి తో తొలి మ్యాచ్ను ఆడనున్న ఎస్ ఆర్ హెచ్.

ఈ నెల‌ 28 నుంచి మే 31 వరకు ఐపీఎల్ టోర్నమెంట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026

టోర్నమెంట్ తొలి 20 రోజుల షెడ్యూల్‌ను  గురువారం విడుదల చేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా తెలిపారు.

ఐపీఎల్ 19వ ఎడిషన్ ఈ నెల‌ 28 నుంచి మే 31 వరకు జరగనుంది.

బీసీసీఐ ప్రతి సంవత్సరం  ఐపీఎల్ షెడ్యూల్ ను ఒకేసారి  ప్రకటిస్తుంది

కానీ ఈసారి షెడ్యూల్‌ను ఒకేసారి ప్రకటించకపోవడానికి పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మ్యాచ్‌ల తేదీలు ఎన్నికలతో ఇబ్బంది లేకుండా చూసేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికి తొలి 20 రోజుల షెడ్యూల్ మాత్రమే ప్రకటిస్తున్నాం.

ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాత మిగతా షెడ్యూల్‌ను విడుదల చేస్తాం అని సైకియా తెలిపారు.

మొదటి మ్యాచ్ ను ఈనెల 28న ఛాంపియన్ ఆర్ సి బి తో ఎస్ ఆర్ హెచ్ ఆడనుంది.

 

 

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button