ముంద్రా పోర్టుకు చేరిన భారీ గ్యాస్ నౌక ‘శివాలిక్’..!
ఖతార్ నుంచి బయలుదేరిన భారీ చమురు నౌక ‘శివాలిక్’ గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకుంది.

దేశీయ ఇంధన అవసరాల దృష్ట్యా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖతార్ నుంచి బయలుదేరిన భారీ చమురు నౌక ‘శివాలిక్’ గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకుంది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, అత్యంత సమస్యాత్మకమైన హర్మూజ్ జలసంధిని దాటుకుని ఈ నౌక భారత్ చేరుకోవడం విశేషం.
దాదాపు 54 వేల టన్నుల ఎల్‌పీజీ (LPG) నిల్వలతో వచ్చిన ఈ నౌక రాకతో దేశంలో గ్యాస్ కొరత తలెత్తకుండా పెద్ద ఊరట లభించనుంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అంతర్జాతీయ జలాల్లో సవాళ్లను అధిగమించి ఈ భారీ నౌక సకాలంలో గమ్యస్థానానికి చేరుకోవడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



