ది రాాజాసాబ్ దెబ్బకు హట్ స్టార్ క్రాష్..?

హట్ స్టార్ యాప్ లో సినిమా చూద్దామని యాప్ ను ప్లే చేస్తే ప్లే కావడం లేదు.  ఓటీటీలో సినిమా క్రాష్ అవుతుంది. దీంతొ ధియేటర్లలో సినిమాను చూడలేని వారు ఓటీటీలోనైనా చూద్దామని టీవీల ముందు కూర్చుంటే సినిమా ప్లే కాకుండా ఆగిపోవడం బాగోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ‘ది రాజాసాబ్’ జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ వచ్చేసింది. జియో హాట్‌స్టార్‌కు మునుపెన్నడూ లేనంత ట్రాఫిక్ వచ్చి పడిందని.. దీంతో తమ సర్వర్లను అప్‌గ్రేడ్ చేసిపెట్టి సిద్ధంగా ఉన్నట్లు జియో హాట్‌స్టార్ అధికారిక ప్రకటన చేసింది.

దీంతొ ధియేటర్లలో సినిమాను చూడలేని వారు ఓటీటీలోనైనా చూద్దామని టీవీల ముందు కూర్చుంటే సినిమా ప్లే కాకుండా ఆగిపోవడం బాగోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   ఓటీటీలో సినిమా క్రాష్ అవుతుంది.

ఈ ఓటీటీ స్ట్రీమింగ్‌లో ఎక్స్‌టెండెడ్ వెర్షన్ అందుబాటులో ఉంటుందని మేకర్స్ ప్రకటించారు.

ఎక్స్‌టెండెడ్ వెర్షన్ లో ఉండేవివే…

  • ప్రభాస్ ఓల్డ్ గెటప్: థియేట్రికల్ వెర్షన్‌లో మిస్ అయిన ప్రభాస్ ‘ఓల్డ్ అవతార్’ సీన్స్ (సుమారు 4 నిమిషాలు) ఇందులో యాడ్ చేశారు. టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇవి థియేటర్లలో సరిగ్గా ప్లే అవ్వలేదు.

  • అదనపు నిడివి: దాదాపు 8 నుండి 10 నిమిషాల అదనపు ఫుటేజీని చేర్చినట్లు సమాచారం. ఇందులో కొన్ని కామెడీ బిట్స్ మరియు ఒక రూఫ్‌టాప్ ఫైట్ సీక్వెన్స్ కూడా ఉన్నాయని టాక్.

  • మెరుగైన ఎడిటింగ్: థియేట్రికల్ వెర్షన్‌లో పేసింగ్ మరియు కంటిన్యూటీ సమస్యలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి. డైరెక్టర్ మారుతి ఈ వెర్షన్‌లో సెకండ్ హాఫ్‌ను మరికొంత షార్ప్‌గా ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది.

  • ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను టీ.జీ.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button