నేటి నుండి శ్రీ కోట మైసమ్మ అమ్మవారి పవిత్ర బ్రహ్మోత్సవాలు

సింగరేణి మార్చి 19(నిజం న్యూస్):
సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామ పంచాయతీలోని శ్రీ కోట మైసమ్మ దేవాలయంలో ఈనెల 20 నుండి మూడు రోజులపాటు పవిత్ర బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు *ఆలయ చైర్మన్ పర్స పట్టాభి రామారావు. కార్యనిర్వాహణ అధికారి. కె వేణుగోపాలచార్యులు* తెలిపారు.
దేవాలయం వద్ద వారు మాట్లాడుతూ కృష్ణ యజరేవద పండితులు బ్రహ్మశ్రీ కొండ మంచిలి ఫణికుమార్ శర్మ బృందంచే 20వ తేదీన మంగళవాయిద్యాలు, మంగళ తోరణలు. మహా విద్య పశుపద హోమము ఉంటుందన్నారు.
21వ తేదీన శ్రీ భ్రమరాంబ సమేత రామలింగేశ్వర స్వామి వారి మహానాస్య పూర్వర ఏకాదశ రుద్రాభిషేకము జలబిందెల అభిషేకము మహిళలచే సామూహిక కుంక మార్చన పూజ శ్రీ మహా త్రిపుర సుందరి బ్రహ్మ విద్య మంత్రహుమము, 22వ తేదీన మహా పుష్పార్చన మహా మహాపూర్ణహుతి నిర్వహించడం జరుగుతుందన్నారు.
కావున భక్తులందరూ అధిక సంఖ్యలో బ్రహ్మోత్సవాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.



