బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల !
రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.

త్వరలోనే భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్
గ్రూప్స్, పోలీస్, టీచర్ పోస్టులు, క్లర్క్ కేటగిరీల్లో భారీగా ఖాళీలు భర్తీ చేసే అవకాశం
తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త తెలిపేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది
రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ఈ ప్రకటనతో తెలంగాణలో లక్ష లాది మంది నిరుద్యోగ యువతలో ఉత్సాహం నెలకొననుంది .
ఉద్యోగం కోసం ఏళ్లుగా కష్టపడుతున్న అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం కావొచ్చు.
గ్రూప్స్, పోలీస్, టీచర్ పోస్టులు, క్లర్క్ కేటగిరీల్లో భారీగా ఖాళీలు భర్తీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఏఏ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం?
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం క్రింది శాఖల్లో ఖాళీలు భర్తీ చేసే అవకాశముంది:
రెవెన్యూ శాఖ
పోలీస్ శాఖ
విద్యాశాఖ (టీచర్ పోస్టులు)
పంచాయతీ రాజ్
హెల్త్ డిపార్ట్మెంట్
గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు
గతంలో నిలిచిపోయిన కొన్ని నియామక ప్రక్రియలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశముందని చెబుతున్నారు.
నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కావచ్చు?
సాధారణంగా బడ్జెట్ సమావేశాల తర్వాత రాబోయే నెల రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తుంది.
అర్హతలు ఏమిటి?
పోస్టును బట్టి అర్హతలు మారుతాయి. సాధారణంగా:
గ్రూప్ పోస్టులకు డిగ్రీ తప్పనిసరి
టీచర్ పోస్టులకు B.Ed / D.Ed
పోలీస్ పోస్టులకు ఇంటర్ / డిగ్రీ
వయస్సు పరిమితి 18–44 సంవత్సరాలు (రిజర్వేషన్ ప్రకారం సడలింపు ఉంటుంది)



