ప్రభుత్వ వైద్యునికి ఉత్తమ డాక్టర్ గా అవార్డు
గరిడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేయుచున్న డాక్టర్ వి నరేష్ కి ఉత్తమ వైద్యసేవలు అందించినందుకు గాను మంగళవారం రోజు కలెక్టర్ మరియు డీఎంహెచ్ఓ చేతుల మీదుగా ఉత్తమ డాక్టర్ గా అవార్డును అందుకున్నారు

గరిడేపల్లి మార్చి 24 (నిజం చెపుతాం)
గరిడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేయుచున్న డాక్టర్ వి నరేష్ కి ఉత్తమ వైద్యసేవలు అందించినందుకు గాను మంగళవారం రోజు కలెక్టర్ మరియు డీఎంహెచ్ఓ చేతుల మీదుగా ఉత్తమ డాక్టర్ గా అవార్డును అందుకున్నారు.
టిబి ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న కొత్తగూడెం గ్రామంలో గత మూడు సంవత్సరాల నుండి ఒక్క టిబి కేసు కూడా నమోదు కాలేదు కావున కొత్తగూడెం గ్రామాన్ని టిబి ఫ్రీ విలేజ్ గా ప్రకటించడం జరిగింది.
అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నమోదైన టిబి కేసులకు సకాలంలో మందులు అందజేయడం మరియు ఫాలోఅప్స్ చేయించడం, అదేవిధంగా వారికి పౌష్టికాహారం కిట్టును అందజేయడం, క్షయ వ్యాధిని నయం చేయడం అన్ని విభాగాలలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించినందుకు గాను మరియు అన్ని జాతీయ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించినందుకు గాను డాక్టర్ కి ఈ అవార్డును అందజేశారు.
కొత్తగూడెం సర్పంచ్ సుధా కి, కార్యదర్శి కి ప్రశంసా పత్రమును అందజేశారు.



