ఎస్సీ యువతకు గుడ్ న్యూస్… స్వయం ఉపాధి దరఖాస్తులకు మరింత గడువు!

మహబూబాబాద్, మార్చి 25:జిల్లా ప్రతినిధి (నిజం న్యూస్ )

జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం ద్వారా 2025-26 సంవత్సరానికి సంబంధించి స్వయం ఉపాధి పథకాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును ఏప్రిల్ 2, 2026 వరకు పొడిగించినట్లు ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు కె. శ్రీనివాసరావు తెలిపారు.

అర్హులైన షెడ్యూల్డ్ కులాలకు చెందిన యువతీ, యువకులు కుల, ఆదాయ, నివాస ధృవపత్రాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు సమర్పిస్తూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

వ్యవసాయ రంగానికి సంబంధించిన యూనిట్లకు పట్టాదారు పాసుపుస్తకం, రవాణా రంగానికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా జతపరచాలని పేర్కొన్నారు.

పథకాల పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని, ఈ అవకాశాన్ని అర్హులైన నిరుద్యోగ ఎస్సీ యువత సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button