పోలీస్ అంటూ బెదిరించి డబ్బులు దోచుకున్న నకిలీ కానిస్టేబుల్ అరెస్ట్

రూ.22,300 లాక్కున్న నిందితుడు రిమాండ్‌కు తరలింపు.. సెల్ ఫోన్ స్వాధీనం

  1. పోలీస్ అంటూ బెదిరించి డబ్బులు దోచుకున్న నకిలీ కానిస్టేబుల్ అరెస్ట్

రూ.22,300 లాక్కున్న నిందితుడు రిమాండ్‌కు తరలింపు.. సెల్ ఫోన్ స్వాధీనం

వివరాలలోకి వెళ్తే, పిర్యాది పులిచింతల శ్రీనివాస్, నివాసం మరిపెడ, 15-02-2026న మహాశివరాత్రి సందర్భంగా కురవి జాతరకు వెళ్లాడు. జాతరలో డప్పు వాయిద్యాల మధ్య మహిళల డాన్స్ జరుగుతుండగా, ఒక వ్యక్తి అతన్ని పక్కకు పిలిచి తాను కురవి క్రైమ్ కానిస్టేబుల్ అని చెప్పుకొని బెదిరించాడు.

“నువ్వు మహిళలను అసభ్యకరంగా చూస్తున్నావు.. నిన్ను అరెస్ట్ చేస్తాను” అంటూ భయపెట్టి, డబ్బులు ఇస్తే వదిలేస్తానని లేకుంటే కేసు పెట్టి జైలుకు పంపిస్తానని హెచ్చరించాడు. దీంతో భయపడిన బాధితుడి వద్ద ఉన్న రూ.18,400 నగదును తీసుకున్నాడు.

అంతటితో ఆగకుండా, ఇంకా డబ్బులు ఇవ్వకపోతే లాటీతో కొడతానని బెదిరించి, బాధితుడి సెల్ ఫోన్ ద్వారా ఫోన్‌పే ద్వారా మరో రూ.3,900 తన నంబర్‌కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. మొత్తం రూ.22,300 రూపాయలు లాక్కున్నాడు.

కొద్ది రోజుల తర్వాత బాధితుడికి అనుమానం వచ్చి విచారణ చేయగా, కురవి పోలీస్ స్టేషన్‌లో ఆ పేరుతో ఎలాంటి కానిస్టేబుల్ లేడని తెలిసి తాను మోసపోయినట్టు గ్రహించాడు. దీంతో తనకు జరిగిన అన్యాయం గురించి కురవి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఫోన్‌పే వివరాల ఆధారంగా నిందితుడు ఎర్పుల నాగరాజు, వయసు 26 సంవత్సరాలు, గాంధీపురం, మహబూబాబాద్ రూరల్ నివాసిగా గుర్తించారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి, నేరంలో ఉపయోగించిన సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

అనధికార వ్యక్తులు ప్రభుత్వ అధికారుల పేరుతో ప్రజలను బెదిరించి మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

— శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button