ఈ బౌలింగ్ తో SRH ఒక్క మ్యాచ్ గెలిచినా… అది అద్భుతమే..!
బ్యాటింగ్ లో విజృంభిస్తే ఎస్ ఆర్ హెచ్ భారీ గా పరుగులు సాధించే అవకాశం ఉంది . దీంతో బౌలింగ్ బలహీనంగా ఉన్న పెద్ద టార్గెట్ ఉంచి గెలవడానికి ప్రయత్నించవచ్చని క్రీడా పండితులు సలహా ఇస్తున్నారు.

సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ బౌలింగ్ తో ఒక్క మ్యాచ్ ను కూడా గెలవలేదని ఒకవేళ గెలిస్తే అది అద్భుతమే అని క్రికెట్ క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఫ్యాట్ కమింగ్ లేని సన్రైజర్స్ బౌలింగ్ చాలా బలహీనంగా కనిపిస్తుంది. బ్రైడన్ కార్స్ కీలకమవుతాడని అనుకున్న అతను తుది జట్టులోనే లేడు.
సీనియర్ పేసర్ ఉన్కదత్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు భారీగా పరుగులు ఇస్తున్నాడు. ఇషాన్ మలింగను తీసుకున్న అతను తేలిపోయాడు.
హర్షల్ పటేల్ బౌలింగ్ అంతంత మాత్రమే. ఆల్రౌండర్ గా జట్టును ఆదుకుంటాడు అనుకుంటున్న నితీష్ రెడ్డి ఎలాంటి ప్రభావం చూపడం లేదు.
కోల్ కతా పిచ్ బ్యాటింగ్ కు స్వర్గధామంగా ఉంటుంది. ఈ పిచ్ పై ఫేస్ బౌలర్ల కంటే స్పిన్నర్లే కాస్త కూస్తే ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
మొదటి మ్యాచ్లో స్పిన్నర్ అన్సారిని పక్కన పెట్టారు. కోల్ కతా మ్యాచ్ లో ఇతన్ని తీసుకుంటే స్పిన్ బౌలింగ్ బలోపేతం అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.
బ్యాటింగ్ లో ఇరగదీస్తారనుకున్న ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ లు మొదటి మ్యాచ్ లో తక్కువ స్కోరు కే అవుట్ కావడంతో ఎస్ఆర్ హెచ్ కష్టాల్లో పడింది.
వీరిద్దరూ బ్యాటింగ్ లో విజృంభిస్తే ఎస్ ఆర్ హెచ్ భారీ గా పరుగులు సాధించే అవకాశం ఉంది . దీంతో బౌలింగ్ బలహీనంగా ఉన్న పెద్ద టార్గెట్ ఉంచి గెలవడానికి ప్రయత్నించవచ్చని క్రీడా పండితులు సలహా ఇస్తున్నారు.



