అలరించిన మహా పురుషుడు నాటక ప్రదర్శన 

దంటు కళాక్షేత్రంలో శనివారం రాత్రి కాకినాడ ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ఆధ్వర్యంలో మహా పురుషుడు నాటక ప్రదర్శన జరిగింది.

అలరించిన మహా పురుషుడు నాటక ప్రదర్శన

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (రామచంద్రపురం) బ్యూరో… మార్చి 22..నిజం చెపుతాం న్యూస్…

దంటు కళాక్షేత్రంలో శనివారం రాత్రి కాకినాడ ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ఆధ్వర్యంలో మహా పురుషుడు నాటక ప్రదర్శన జరిగింది.

అరవింద ఆర్ట్స్, తాడేపల్లి గంగోత్రి సాయిబృందానికి చెందిన సుమారు 46 మంది నటీనటులు ఈ నాటికలో పాల్గొన్నారు.

మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ నాటకాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ నాటకాన్ని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, జనసేన నేత,అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సంచాలకుడు మల్లికార్జునరావుతో కలిసి వీక్షించినట్లు  తెలిపారు.

తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబింప చేసే ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని వక్తలు ఈ సందర్బంగా అభిప్రాయపడ్డారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button