ENG SUPER- 8 : ఇంగ్లాండ్ సూపర్- 8 ఆశలు సజీవం
ఆదిల్ రషీద్ మూడు వికెట్లు, టామ్ బాంటన్ అజేయంగా 63 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ కోల్‌కతాలో స్కాట్లాండ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి, T20 ప్రపంచ కప్‌లో సూపర్ -8 ఆశలను సజీవంగా ఉంచుకుంది.

స్కాట్లాండ్ పై విజయంతో ఇంగ్లాండ్ సూపర్ ఎయిట్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది
ఆదిల్ రషీద్ 3 వికెట్లు, టామ్ బాంటన్ అజేయంగా 63 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ కోల్‌కతాలో స్కాట్లాండ్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి, T20 ప్రపంచ కప్‌లో సూపర్ -8 ఆశలను సజీవంగా ఉంచుకుంది.
స్కాట్లాండ్ 113/3 మంచి స్థితి నుండి అకస్మాత్తుగా 152కి పడిపోయింది. ఇంగ్లాండ్ స్పిన్నర్ల చేతిలో వెంట వెంటనే వికెట్లను కోల్పోయి ఓటమిని కొని తెచ్చుకుంది.
కోల్‌కతా: టామ్ బాంటన్ అజేయ అర్ధ సెంచరీతో ఇంగ్లాండ్ స్కాట్లాండ్‌పై 5 వికెట్ల తేడాతో కీలకమైన విజయాన్ని సాధించింది, శనివారం కోల్ కత్తాలో జరిగిన T20 ప్రపంచ కప్‌లో మ్యాచ్ లో గెలిచి సూపర్ 8 ఆశలను సజీవంగా ఉంచుకుంది.
వెస్టిండీస్ చేతిలో ఓడిన తర్వాత తప్పక గెలవాల్సిన గ్రూప్ సి మ్యాచ్‌లో, రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన ఇంగ్లాండ్ ఆదిల్ రషీద్ (3/36) మరియు లియామ్ డాసన్ (2/34) ల బౌలింగ్ తో స్కాట్లాండ్‌ను 19.4 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌట్ చేసి గెలిచింది.
స్కాట్లాండ్ 12.3 ఓవర్లలో 3 వికెట్లకు 113 పరుగులతో మంచి స్థితిలో ఉంది. 180 పరుగులను సాధించేలా కనిపించింది. కానీ 14 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ మలుపు తిరిగి ఇంగ్లాండ్ విజయం సాధించింది.
ఇంగ్లాండ్ ప్రారంభ రెండు ఓవర్లలో 13 పరుగులకు 2 వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత బాంటన్ నిలదొక్కుకుని 41 బంతుల్లో (4×4, 3×6) 63 నాటౌట్‌గా నిలిచాడు.
నేపాల్‌పై తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లాండ్ జట్టు వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. గ్రూప్‌లో నాలుగు పాయింట్లతో వెస్టిండీస్ తర్వాత రెండవ స్థానానికి చేరుకుంది.
సోమవారం ఇంగ్లాండ్ ఇటలీతో తలపడి గెలిస్తే సూపర్ ఎయిట్స్ బెర్తు ఖరారయ్యే అవకాశం ఉంది.


