ఐరిస్ నమోదు కాని కూలీలకు ఉపాధి ప్రశ్నార్థకం
ఉపాధి హామీ పథకంలో కూలీల హాజరుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఐరిస్ విధానం కష్టజీవులకు చుక్కలు చూపిస్తుంది. ఐరిస్ నమోదవ్వని కారణంగా యాదగిరిగుట్ట మండల వ్యాప్తంగా వందలాది మంది కూలీలు ఇళ్లకు పరిమితం అవుతున్నారు.

ఉపాధి కూలీలకు కంటి పరీక్ష
-యాప్ లో సాంకేతిక సమస్యతో వందలాది మంది పనులకు దూరం
– కొత్తగా ఐరిస్ విధానంలో హాజరు నమోదు తో ఇళ్లకే పరిమితమైతున్న పేదలు
యాదగిరిగుట్ట,ఏప్రిల్ 9(నిజంచెపుతాం) ఉపాధి హామీ పథకంలో కూలీల హాజరుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఐరిస్ విధానం కష్టజీవులకు చుక్కలు చూపిస్తుంది. ఐరిస్ నమోదవ్వని కారణంగా యాదగిరిగుట్ట మండల వ్యాప్తంగా వందలాది మంది కూలీలు ఇళ్లకు పరిమితం అవుతున్నారు.
యాప్ లో సాంకేతిక సమస్యతో పనులకు దూరం చేయడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యాదగిరిగుట్ట మండలంలో సాదువెళ్లి గ్రామాల్లో ‘నిజం ప్రతినిధి’ పర్యటించినప్పుడు ఉపాధి కూలీల వేతలు వెలుగు చూశాయి.
రోజు ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలు ఐరిస్ నమోదవానికి కారణంగా కొద్ది గంటల్లోనే ఇళ్లకు తిరుగు ముఖం పడుతున్నారు. క్షేత్ర సాయి సిబ్బంది అనేక ప్రయత్నాలు చేస్తున్న హాజరైన వారిలో30-40% మంది యాప్ లో నమోదు కావడం లేదు.
డేటా తో సరిపోలడం లేదని (మిస్ మ్యాచింగ్ )యాప్ సూచిస్తుంది. ఐరిస్ నమోదు కాని కూలీలకు ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది.
ఈ కేవైసీ చేయించిన ఎందుకిలా?
• కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై శ్రామికుల వివరాలతో ఉపాధి సిబ్బంది ఈ కేవైసీ చేయించారు. ఆధార్ కార్డు వాటి వివరాలతోపాటు శ్రామికుల ఫోటోలు తీసే యాప్ లో అప్ లోడ్ చేశారు.
* ఈ కేవైసీ డేటా ఆధారంగా పని ప్రదేశంలో కూలీల ఐరిస్ తీసుకుంటున్నారు.ఏ శ్రామికుల వివరాలతో సిబ్బంది ఈ కేవైసీ చేయించారో. అదే శ్రామికుల ఐరిస్ మిస్ మ్యాచ్ కావడమే ప్రస్తుతం చర్చనీయంశమవుతుంది.
పనికంటే నిరీక్షణే ఎక్కువ.. దుబ్బాసి శ్రీరాములు ఉపాధి శ్రామికుడు సాధువెల్లి
అనేక ఏళ్లుగా ఉపాధి హామీ పనులకు వెళుతున్నాను పనికంటే నిరీక్షణే ఎక్కువ అవుతుంది.ఐరిస్ నమోదు నమోదవడం లేదని పనులకు దూరం చేస్తే ఎలా బ్రతకాలి?యాప్ లో తలెత్తే సమస్యలకు మమ్మల్ని బాధ్యులను చేస్తే ఎలా? సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
సాంకేతిక సమస్యతో ఇబ్బందులు.. గుజ్జుక శ్రీను ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం మండల అధ్యక్షుడు
ఉపాధి హామీ కూలీల హాజరు నమోదులో సర్వర్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, కూలీలు గంటల తరబడి వేచి ఉండి ఇంటి బాట పడుతున్నారని,దీంతో కూలీల హాజరు తక్కువగా నమోదయ్యి కూలీలకు పని కల్పించలేకపోతున్నామని,ఉన్నతాధికారులు స్పందించి ఐరిస్ విధానానికి బదులు, బయోమెట్రిక్ ద్వారా హాజరు విధానాన్ని తీసుకువస్తే ఉపాధి హామీ సిబ్బందికి ఇబ్బందులు తప్పి, కూలీల సమస్య పరిష్కారం అవుతుంది అన్నారు.



