అర్హత గల పౌరునికి ఓటు హక్కు కల్పించాలి, కలెక్టర్

అర్హత గల పౌరులకు ఓటు హక్కు కల్పిస్తూ జాబితాలో వారి పేరును నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి రాహుల్ శర్మ అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్

భూపాలపల్లి మహదేవపూర్ ఏప్రిల్ 4 నిజం న్యూస్

అర్హత గల పౌరులకు ఓటు హక్కు కల్పిస్తూ జాబితాలో వారి పేరును నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి రాహుల్ శర్మ అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బి ఎల్ఓ బూత్ ఏజెంట్ లాంటి తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడంతో ఐ డి ఓ సి కార్యాలయం నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో జిల్లాలో 66.38%, జరిగినట్లు వారు తెలిపారు. ఎన్నికల జాబితాలో డూప్లికేట్ మరియు అనర్హుల పేర్లను తొలగించుటకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు, ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు తమ ఏజెంట్లను నియమించాలని సూచించారు ఫారం 6 7 8 త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు చర్యలు తీసుకుంటామని తెలిపారు కలెక్టర్ ఈ ప్రక్రియలో బూతులు అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని ప్రజలు తమ ఓటరు వివరాల్లో ఎటువంటి మార్పులు లేదా కొత్త ఓటర్ కార్డు నమోదు కావాలన్నా సంబంధిత ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు, ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ భూపాలపల్లి తహసిల్దార్ శ్రీనివాస్ ఎన్నికల విభాగం డిటి అబ్బాస్ తో పాటు తదితర సిబ్బంది ఉన్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button