రైతులకు 100% సబ్సిడీతో కూరగాయల విత్తనాలు పంపిణీ…130 మంది రైతులకు లక్ష 50 వేల విలువ చేసే కూరగాయల విత్తనాల పంపిణీ
హన్మకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని రైతు వేదిక నందు హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో రైతులకు 100% సబ్సిడీతో కూరగాయల విత్తనాలు శనివారం పంపిణీ చేసారు.

సబ్సిడీతో కూరగాయల విత్తనాలు పంపిణీ
వేలేరు మార్చి 28(నిజం న్యూస్ ) హన్మకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని రైతు వేదిక నందు హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో రైతులకు 100% సబ్సిడీతో కూరగాయల విత్తనాలు పంపిణీ
రైతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బడ్జెట్లో కూడా ఎక్కువ శాతం నిధులను కేటాయించడం జరిగిందని తెలిపారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో వేలేరు మండలంలో కూడా రైతులకు చాలావరకు సబ్సిడీ యంత్రాలను మంజూరు చేయడం జరిగిందని ప్రభుత్వం రైతులకు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా రైతులను కోరడం జరిగింది
130 మంది రైతులకు (ఒక) 1 లక్ష 50 వేల విలువ చేసే కూరగాయల విత్తనాలు అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు , రైతులు పాల్గొన్నారు.



