ధురంధర్-2 ఎఫెక్ట్.. పాకిస్తాన్‌లో టెన్షన్ స్టార్ట్!
ధురంధర్-2 సినిమా విడుదల తర్వాత పొరుగు దేశమైన పాకిస్తాన్ లో భద్రతా చర్యలు కఠినతరం చేసినట్లు సోషల్ మీడియా వేదికల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కరాచీ నగరంలోని ల్యారీ ప్రాంతంలో పోలీసులు రోడ్లపై ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

అక్కడ సంచరిస్తున్న ప్రతి ఒక్కరిని సాధారణ ప్రజల నుంచి బిచ్చగాళ్ల వరకు ఆపి గుర్తింపు కార్డులు చెక్ చేస్తున్నారని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. “భారతీయ గూఢచారులు దేశంలోకి చొరబడే అవకాశముందనే అనుమానంతో” ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
సినిమాలో చూపించిన గూఢచారి కథాంశం ప్రజల్లో ఆసక్తి కలిగించడంతో పాటు భద్రతా వ్యవస్థలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పాకిస్తాన్ భద్రతా విభాగాలు భావిస్తున్నాయని సమాచారం. అయితే ఈ చర్యలు పూర్తిగా సినిమా ప్రభావం వల్లనేనా లేదా ఇతర భద్రతా కారణాల వల్లనా అన్నది అధికారికంగా వెల్లడికాలేదు.
ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో ఈ ఘటనపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. కొందరు ఇది కేవలం రొటీన్ భద్రతా తనిఖీలేనని చెబుతుండగా, మరికొందరు “ధురంధర్-2 ఎఫెక్ట్” అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
భయం మొదలైందా..? లేక సాధారణ భద్రతా చర్యలేనా..? అనే సందేహం మాత్రం ఇంకా కొనసాగుతోంది.