హేట్ స్పీచ్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ సభ్యులు…బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం
రేవంత్ ప్రభుత్వం మొన్న అసెంబ్లీలో హేట్ స్పీచ్ నియంత్రణ కోసం అంటూ ఒక బిల్లు ప్రవేశపెట్టింది. అయితే దీన్ని బీజేపీ, సీపీఐ, ఎంఐఎం సభలో తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది భావప్రకటనా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు అని విపక్షాలు మండిపడ్డాయి వీరితో పాటు బిల్లు చదివిన కొందరు ఒరిజినల్ కాంగ్రెస్ సభ్యులు కూడా హతాశులయ్యారు.

రేవంత్ హేట్ స్పీచ్ బిల్లును వ్యతిరేకించిన అధికార కాంగ్రెస్ సభ్యులు.
రేపు మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇదే చట్టం వాడుకుని మనల్ని ఫుట్ బాల్ ఆడుకునే అవకాశం ఉందంటూ వద్దన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.
తెలంగాణ ఏర్పడ్డ తరువాత తొలిసారిగా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక బిల్ సెలెక్ట్ కమిటీకి రిఫర్ కావడం వెనుక ఆసక్తికరమైన పరిణామాలు జరిగాయి అని ఆ రోజు సభలో ఉన్న ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తెలిపారు.
సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకీ తీవ్రతరం అవుతుండటంతో కాంగ్రెస్ సర్కారు తీవ్రంగా ఆందోళన చెందుతోంది.
ఎన్ని కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా సోషల్ మీడియా యాక్టివిస్టులు వెనక్కి తగ్గడం లేదు. దీనికి తోడు సోషల్ మీడియా పోస్టుల మీద విచ్చలవిడిగా కేసులు నమోదు చేయొద్దు అని ఇటీవల తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చాయి.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా కట్టడికి కొత్త చట్టం తీసుకురావాలని నిర్ణయించుకున్న రేవంత్ ప్రభుత్వం మొన్న అసెంబ్లీలో హేట్ స్పీచ్ నియంత్రణ కోసం అంటూ ఒక బిల్లు ప్రవేశపెట్టింది. అయితే దీన్ని బీజేపీ, సీపీఐ, ఎంఐఎం సభలో తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది భావప్రకటనా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు అని విపక్షాలు మండిపడ్డాయి వీరితో పాటు బిల్లు చదివిన కొందరు ఒరిజినల్ కాంగ్రెస్ సభ్యులు కూడా హతాశులయ్యారు.
ఇంత దారుణంగా ఉన్న బిల్లు పాస్ అయ్యి చట్టంగా రూపొందితే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు అభిప్రాయపడ్డారు.
ఒక సీనియర్ సభ్యుడైతే “మనం ఎప్పటికీ అధికారంలోనే ఉండం కదా. రేపు మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇదే చట్టం వాడుకుని మనల్ని ఫుట్ బాల్ ఆడుకునే అవకాశం ఉంది. కాబట్టి బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించండి” అని గట్టిగా చెప్పారు.
ఇంకో ముగ్గురు సీనియర్ కాంగ్రెస్ సభ్యులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. విపక్షాల నుండే కాక స్వపక్షం నుండి కూడా తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇక లాభం లేదని వెనక్కి తగ్గిన రేవంత్ ప్రభుత్వం నష్టనివారణ చర్యల్లో భాగంగా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించింది.



