ఇందిరమ్మ ఇండ్ల కాలనీని పరిశీలించిన కలెక్టర్..!
ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ

సభాస్థలి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాల్లో నిర్మించిన 2,160 ఇందిరమ్మ ఇండ్ల మోడల్ హౌసింగ్ కాలనీని కలెక్టర్ పరిశీలించారు.
ఇందిరమ్మ ఇళ్ల కాలనీని త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
అంతర్గత రోడ్లు, హెలిపాడ్, సభాస్థలి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా, అత్యంత అర్హులైన వారినే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, తహసిల్దార్ కవిత మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.



