మార్చి 22న నార్మెట్టలో జరగనున్న రైతు ఉత్సవాలకు (రైతు మహోత్సవం) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆహ్వానం..!

అదే రోజున రైతు భరోసా నిధుల మొదటి విడతను ప్రభుత్వం విడుదల చేయనుంది..!

మార్చి 22న నార్మెట్టలో జరగనున్న రైతు ఉత్సవాలకు (రైతు మహోత్సవం) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆహ్వానించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నార్మెట్ట గ్రామం.తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ ఉత్సవాల్లో పాల్గొని, సుమారు ₹300 కోట్లతో నిర్మించిన ఆధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించనున్నారు.

అదే రోజున (మార్చి 22) రైతు భరోసా నిధుల మొదటి విడతను కూడా ప్రభుత్వం విడుదల చేయనుంది.ఈ మహోత్సవంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించి సుమారు 150 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం, నూతన సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడమే ఈ ఉత్సవం ప్రధాన ఉద్దేశం.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, వివిధ పార్టీల నాయకులను ఆహ్వానించడంలో భాగంగా కేటీఆర్ పేరు కూడా చర్చకు వచ్చింది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో జరిగే ఈ ప్రభుత్వ కార్యక్రమంలో స్థానిక రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ ఆహ్వానం ఆసక్తికరంగా మారింది.

 

 

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button