టాక్స్‌పేయర్లకు బిగ్ అలర్ట్.. మీ జేబుకు చిల్లు..!
పన్ను చెల్లింపుదారులకు భారీ షాక్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..!

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం షాకింగ్ అప్‌డేట్ ఇచ్చింది. పాత పద్ధతులకు చెక్ పెడుతూ, ఏప్రిల్ 1 నుండి కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయం రావడంతో, పన్ను నిబంధనల్లో జరిగిన పెను మార్పులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి రూ. 7 లక్షల వరకు పన్ను నుంచి పూర్తి మినహాయింపు లభించనుంది. ఇది సామాన్యులకు పెద్ద ఊరట కలిగించే అంశం. పన్ను గణనలో స్లాబుల సంఖ్యను తగ్గించి, పన్ను రేట్లను సవరించారు. మీరు ఏ స్లాబ్‌లోకి వస్తారో తెలియకపోతే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.
మీరు జాగ్రత్తగా గమనించకపోతే, సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా ‘కొత్త పన్ను విధానాన్ని’ ఎంపిక చేసుకుంటుంది. పాత విధానంలో మినహాయింపులు కోరుకునే వారు అప్రమత్తంగా ఉండాలి. రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్ ఇకపై కొత్త విధానంలో కూడా వర్తించనుంది.
“పన్ను నిబంధనల్లో మార్పుల పట్ల అవగాహన లేకపోతే ఐటీ నోటీసులు వచ్చే అవకాశం ఉంది. గడువు ముగిసే వరకు వేచి చూడకుండా, వెంటనే మీ పన్ను గణనను సరిచూసుకోవాలి” అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కొత్త మార్పులు కొందరికి వరంగా మారితే, అవగాహన లేని వారికి భారంగా మారే అవకాశం ఉంది. కాబట్టి పన్ను చెల్లింపుదారులు ఈ మార్పులను గమనించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం అత్యవసరం.



