భూదాన్ భూముల వివాదం.. 11 మంది అధికారులకు కోర్టు నోటీసులు ..!

గత 10 సంవత్సరాలుగా 150 ఎకరాల భూదాన్ భూములను సిమెంట్ కంపెనీలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఇట్టి ఆక్రమణలకు ప్రభుత్వ అధికారులు వత్తాసు పలుకుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని గతంలోని హుజూర్నగర్ కోర్టులో ఫిర్యాదు చేసినట్లు కమతం నాగార్జున తెలిపారు.

మేళ్లచెరువులో 150 ఎకరాల భూమి అన్యాక్రాంతం…

*సిసిఎల్ఏ కమిషనర్ సహా 11మంది అధికారులకు, మై హోమ్ సిమెంట్స్, కీర్తి సిమెంట్స్ యాజమాన్యానికి నోటీసులు జారీ
* మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ హుజూర్నగర్ వద్ద ఫిర్యాదు చేసిన స్థానిక న్యాయవాది కమతం నాగార్జున
*
* నోటీసులు జారీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారద.

హుజూర్ నగర్ కోర్టు: మేళ్లచెరువు రెవిన్యూ సర్వేనెంబర్ 1057లో 150 ఎకరాల పేదలకు చెందిన భూధాన్ భూమిని మైహోమ్ సిమెంట్ పరిశ్రమ, కీర్తి సిమెంట్ పరిశ్రమ యాజమాన్యాలు అక్రమంగా ఆక్రమించి, అక్రమనిర్మాణాలు చేపడుతున్నారని, వారికి ప్రభుత్వ అధికారులు వత్తాసు పలుకుతున్నారని, ప్రభుత్వ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకొని కోరుతూ స్థానిక న్యాయవాది కమతం నాగార్జున మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద ముందు ఇటీవల ఫిర్యాదు చేశారు.

భూదాన్ బోర్డ్ సెక్రటరీ, సీసీఎల్ఏ కమిషనర్, జిల్లా కలెక్టర్ సూర్యాపేట, ఆర్డీవో హుజూర్నగర్, తాసిల్దార్ మేళచెరువు, పంచాయతీ కార్యదర్శి, మేళ్లచెరువు, జిల్లా పంచాయతీ అధికారి సూర్యాపేట, ఎస్సై మేళ్లచెరువు ,జిల్లా ఎస్పీ సూర్యాపేట, కీర్తి సిమెంట్స్, మై హోమ్ సిమెంట్స్ ఎండి లతో కలిపి మొత్తం 11 మంది పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

అయితే గత 10 సంవత్సరాలుగా 150 ఎకరాల భూదాన్ భూములను సిమెంట్ కంపెనీలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఇట్టి ఆక్రమణలకు ప్రభుత్వ అధికారులు వత్తాసు పలుకుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని గతంలోని హుజూర్నగర్ కోర్టులో ఫిర్యాదు చేసినట్లు కమతం నాగార్జున తెలిపారు.

రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నందు కేసు పెండింగ్లో ఉండటం వల్ల గతంలో కోర్టు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా హైకోర్టులో కేస్ పెండింగ్లో ఉండగా ఈ కోర్టు ఎటువంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది.

ఇటీవల హైకోర్టు కేసులో తుది తీర్పు వెలువడటంతో, మరల భూదాన్ భూముల ఆన్యాక్రాంతం విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ మేరకు మేళ్లచెరువులో 150 ఎకరాల భూదాన్ భూముల అన్యాక్రాంతం పై మరల స్థానిక న్యాయవాది హుజూర్నగర్ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ జడ్జి వద్ద ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై వాదనలు విన్న సదరు సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతివాదులకు నోటిసులు జారీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

ఈనెల 28వ తేదీన కోర్టు హాజరై తమ సమాధానం దాఖలు చేయాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button