Bangladesh Election 2026: బంగ్లాదేశ్ లో విజయం సాధించిన బీఎన్‌పీ చీప్ తారిఖ్ రెహమాన్‌కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి మోడీ

బంగ్లాదేశ్‌ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) విజయం దిశగా విజయం దిశగా ప్రయాణిస్తుండటంతో బీఎన్‌పీ చీప్ తారిఖ్ రెహమాన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంగ్రాట్స్ తెలిపారు

Bangladesh Election 2026: బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికలలో బీఎన్‌పీని నిర్ణయాత్మక విజయం దిశగా నడిపించినందుకు తారిఖ్ రెహమాన్‌కు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

ఈ విజయం మీ నాయకత్వంపై బంగ్లాదేశ్ ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. ప్రజాస్వామ్య, ప్రగతిశీల, సమగ్ర బంగ్లాదేశ్‌కు భారతదేశం ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుంది.

మన (ఇరుదేశాల) మధ్య ఉన్న బహుముఖ సంబంధాలను బలోపేతం చేయడానికి, మన ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

బంగ్లాదేశ్  పార్లమెంటరీ ఎన్నికల్లో తాము అవసరమైన మెజారిటీని సాధించినట్టుగా తెలిపింది. బంగ్లాదేశ్‌లో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలిపింది. ఎన్నికల కమిషన్ (ఈసీ) ఎన్నికల ఫలితాలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button