బీ అలెర్ట్…రాష్ట్రంలో 4 రోజుల పాటు భారీ వర్షాలు..పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ

ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో వర్షంతో పాటు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంలో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలుపుతున్నారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను ప్రకటించారు. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెపుతున్నారు. 

రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పగలు ఎండలు, సాయంత్రం నుండి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇవాళ, రేపు ఉరుములతో కూడిన తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో వర్షంతో పాటు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంలో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలుపుతున్నారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను ప్రకటించారు. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెపుతున్నారు.

ఉత్తర భారత దేశంలో హిమాలయాలు,  ఆప్ఘనిస్థాన్ ప్రాంతం నుండి వచ్చే గాలులు క్యుములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుపుతున్నారు.

ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వచ్చే వర్షాలు కావడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలుపుతున్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button