Auqib Nabi : టీం ఇండియా వైపు దూసుకొస్తున్న బారాముల్లా ఎక్స్ ప్రెస్

Auqib Nabi : టీం ఇండియా వైపు బారాముల్లా ఎక్స్ ప్రెస్ దూసుకు వస్తుంది. బారాముల్లా ఎక్స్ ప్రెస్ అంటే ఎవరో కాదు అతనే జమ్మూ కశ్మీర్ పేస్ బౌలర్ అకిబ్ నబీ. తన పదునైన పేస్ బౌలింగ్ తో జమ్మూకశ్మీర్ కు రంజీ ట్రోఫీని అందించడానికి శాయశక్తులా ప్రయత్నించాడు నబీ.

Auqib Nabi : టీం ఇండియా వైపు బారాముల్లా ఎక్స్ ప్రెస్ దూసుకు వస్తుంది. బారాముల్లా ఎక్స్ ప్రెస్ అంటే ఎవరో కాదు అతనే జమ్మూ కశ్మీర్ పేస్ బౌలర్ అకిబ్ నబీ. తన పదునైన పేస్ బౌలింగ్ తో జమ్మూకశ్మీర్ కు రంజీ ట్రోఫీని అందించడానికి శాయశక్తులా ప్రయత్నించాడు నబీ.

ఈ రంజీ సీజన్ లో 10 మ్యాచ్ లలో 60 వికెట్లను తీసాడంటే అతని ప్రతిభ ఏమిటో ఈ పాటికే సెలక్టర్లకు అర్థమై ఉంటుంది. ఐపీఎల్ లోనూ రాణిస్తే నబీకి ఇక తిరుగుండదు. ఢిల్లీ క్యాపిటల్ నబీని రూ. 8.40 కోట్లకు కొనుగోలు చేసింది.

అందుకే ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సైతం నబీని రానున్న ఇంగ్లాండ్ టూరుకు ఎంపిక చేయాలని సెలక్టర్లకు సూచించాడు.

 

బారాముల్లా లోని షెరీ లో పుట్టిన నబీ…

బారాముల్లోని షెరీ నబీ పుట్టిన ప్రదేశం. క్రికెట్ నేర్చుకోవడానికి ప్రతీ రోజూ అతను సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి శ్రీనగర్ లో శిక్షణ పొందేవాడు.

2019లో జమ్మూ కాశ్మీర్  రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నాడు. బౌలింగ్ కోచ్ కృష్ణకుమార్ అకిబ్ నబీ బౌలింగ్ లో ఉన్న లోపాలను సరిదిద్ది రాటు దేలేలా చేసాడు. అప్పటి నుండి నబీ వెనుదిరిగి చూడలేదు.

సుదీర్ఘంగా 10 నుండి 12 ఓవర్లు బౌలింగ్ ను చేయగలిగే సత్తాను సొంతం చేసుకున్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ బ్యాట్స్ మెన్ పాలిట సింహా స్వప్నంగా మారాడు.

 

రంజీలో రాణించడంతోనే…

2024-25 సీజన్ లో 9 మ్యాచ్ లలో 44 వికెట్లను, 2025-26 సీజన్ లో 10 మ్యాచ్ లలో 60 వికెట్లను సాధించాడు. బెంగాల్ తో సెమీ ఫైనల్లో నబీ  ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలి  ఇన్నింగ్స్ లో 5, రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లను పడగొట్టడంతో పాటు 42 పరుగులకు చేసాడు. కర్నాటకలో ఫైనల్ లో 5 వికెట్లను సాధించాడు. దానిలో కెెఎల్ రాహుల్, నాయర్ వంటి వికెట్లుండటం గమనార్హం. అంతేకాక విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ పై అజేయంగా సెంచరీ (114) సాధించి, 3 వికెట్లను తీసి జట్టును గెలిపించాడు.

 

ఇప్పటి దాకా సాధించిన రికార్డులివే….

40 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 151 వికెట్లను తీసి 967 పరుగులను చేసాడు. 36 లిస్ట్ ఎ మ్యాచ్ లలో 56 వికెట్లను తీసి 572 పరుగులను చేసాడు. రంజీ ట్రోఫీ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ను కైవసం చేసుకున్నాడు.

 

 

 

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button