తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు!
50 శాతం పెంపు అమలులోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలు 175 నుండి 263కి, తెలంగాణలో 119 నుండి 179కి పెరిగే అవకాశం ఉంది. అలాగే ఏపీలో లోక్సభ సీట్లు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి చేరే అవకాశం కనిపిస్తోంది.

- దేశ రాజకీయాల్లో ఒక సంచలన మార్పుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. లోక్సభ మరియు దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాలను ఏకంగా 50 శాతం మేర పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలను 816కి, అలాగే దేశవ్యాప్త అసెంబ్లీ స్థానాలను 6,185కి పెంచాలని కేంద్రం భావిస్తోంది. ప్రధానంగా మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసే క్రమంలో, పురుష ప్రతినిధుల సంఖ్య తగ్గకుండా ఉండేందుకే ఈ పెంపు ఫార్ములాను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే కేంద్రం బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.ఒకవేళ ఈ 50 శాతం పెంపు అమలులోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలు 175 నుండి 263కి, తెలంగాణలో 119 నుండి 179కి పెరిగే అవకాశం ఉంది. అలాగే ఏపీలో లోక్సభ సీట్లు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి చేరే అవకాశం కనిపిస్తోంది. ఇది అమలైతే వచ్చే ఎన్నికల నాటికి దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోనుంది.
- ప్రస్తుత స్థానాలు | పెరిగిన తర్వాత (అంచనా)
| లోక్సభ: 543 | 816 |
| అసెంబ్లీ: 4,123 | 6,185 |
| ఏపీ అసెంబ్లీ: 175 | 263 |
| తెలంగాణ అసెంబ్లీ: 119 | 179



