తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ‘కన్నేసింది’.. కాంగ్రెస్ నిద్రపోతోంది..!
ఏపీ ప్రభుత్వం గోదావరి జలాలను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తోందని, దీనివల్ల తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

హరీష్ రావు ఘాటు విమర్శలు..!
గోదావరి జలాల వినియోగంలో తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తున్నా, ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని ఆయన మండిపడ్డారు.
ఏపీ ప్రభుత్వం గోదావరి జలాలను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తోందని, దీనివల్ల తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కేంద్రాన్ని గానీ, పొరుగు రాష్ట్రాన్ని గానీ ప్రశ్నించే ధైర్యం చేయడం లేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణకు దక్కాల్సిన చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని, ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అన్యాయంపై తాము రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెడుతున్నారా? ప్రాజెక్టుల రక్షణలో ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది?” అంటూ హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు.



