రూ.5 కోట్లతో ద్రాక్షారామంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి సుభాష్

ఏళ్ల తరబడి 15 గ్రామాల్లో ఉన్న లో -వోల్టేజ్ సమస్య కష్టాలు తీరాయి. ఈ సందర్భంగా రామచంద్రపురం రూరల్ మండలం అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనుబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ఈ నూతన సబ్ స్టేషన్ ప్రారంభంతో ద్రాక్షారామతో పాటు వెలంపాలెం,జగన్నాయకులపాలెం, ఆదివారపు పేట, వెల్ల, వెల్లసావరం, ఏరుపల్లి, గొల్లలచెరువు, వాటర్ వర్క్స్, కందులపాలెం, హసన్‌బాద్ ఉండూరు, భీమక్రోసుపాలెం, తోటపేట, అన్నాయిపేట, వేగాయమ్మపేట, వెంకటాయపాలెం తదితర గ్రామాలకు శాశ్వత లో వోల్టేజ్ సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారం, అగ్రికల్చరల్ సర్వీసులకు 9 గంటల విద్యుత్ లభిస్తుందని స్పష్టం చేశారు.

15 గ్రామాలకు తీరనున్న విద్యుత్ లో- వోల్టేజ్ సమస్యలు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (రామచంద్రపురం )చల్లా శ్రీనివాస్… జిల్లా బ్యూరో… ఫిబ్రవరి 4..నిజం చెపుతాం న్యూస్…

వేసవిలో విద్యుత్ లో ఓల్టేజ్ సమస్యలతో సతమతమయ్యే గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్.

వివరాల్లోకి వెళితే ద్రాక్షారామ గ్రామపంచాయతీ పరిధిలోని లేఔట్–4లో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో రూ. 3.05 కోట్లతో నిర్మించిన 33/11 కె వి విద్యుత్ సబ్ స్టేషన్‌, రూ.2 కోట్లతో చేపట్టిన విద్యుత్ ఆధునీకరణ పనులను మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం ఘనంగా ప్రారంభించారు.

దీంతో ఏళ్ల తరబడి 15 గ్రామాల్లో ఉన్న లో -వోల్టేజ్ సమస్య కష్టాలు తీరాయి. ఈ సందర్భంగా రామచంద్రపురం రూరల్ మండలం అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనుబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ఈ నూతన సబ్ స్టేషన్ ప్రారంభంతో ద్రాక్షారామతో పాటు వెలంపాలెం,జగన్నాయకులపాలెం, ఆదివారపు పేట, వెల్ల, వెల్లసావరం, ఏరుపల్లి, గొల్లలచెరువు, వాటర్ వర్క్స్, కందులపాలెం, హసన్‌బాద్ ఉండూరు, భీమక్రోసుపాలెం, తోటపేట, అన్నాయిపేట, వేగాయమ్మపేట, వెంకటాయపాలెం తదితర గ్రామాలకు శాశ్వత లో వోల్టేజ్ సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారం, అగ్రికల్చరల్ సర్వీసులకు 9 గంటల విద్యుత్ లభిస్తుందని స్పష్టం చేశారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి విద్యుత్ మౌలిక వసతులు కీలకమన్నారు. ఈ సబ్ స్టేషన్ ద్వారా గృహాలు, వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు.

అలాగే ద్రాక్షారామ సెక్షన్ పరిధిలో విద్యుత్ పోల్స్ ఎత్తు పెంచడం, కొత్తగా 19 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు, పాడైన పోల్స్ స్థానంలో కొత్తవి ఏర్పాటు, షార్ట్ డి టి ఆర్ ఎస్, పాడైన కండక్టర్ మార్పు, ఎల్ టి ఏ బి కేబుల్ తదితర పనుల కోసం రూ. 2.01 కోట్లుతో పనులు పూర్తి చేశారు.

మొత్తంగా రూ. 5 కోట్లు వెచ్చించడం ద్వారా విద్యుత్ సంస్కరణలు జరిగాయి. మంత్రి సుభాష్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు మొత్తం 8 సబ్ స్టేషన్ లో మంజూరు కాగా మొదటగా ఇక్కడే ప్రారంభించమన్నారు.
కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని, విద్యుత్ ధరలను తగ్గించి ప్రజలకు ఊరటనిచ్చే దిశగా నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో గత వైసిపి ప్రభుత్వం ట్రూ అప్ పేరుతో 9 సార్లు విద్యుత్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారాన్ని మోపిందని తీవ్రంగా విమర్శించారు.

రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ద్వారా గడచిన 19 నెలల్లో 30 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని, వీటి ద్వారా 20 లక్షల ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది అన్నారు.

విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ బి రాజేశ్వరి మాట్లాడుతూ మంత్రి సుభాష్ కృషితో పనులు వేగవంతం చేసి వేసవి ముందే సబ్ స్టేషన్ ప్రారంభించడం ఆనందకరమన్నారు. పీఎం సూర్య ఘర్ పథకాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత రాయ్, ద్రాక్షారామం సర్పంచ్ కొత్తపల్లి అరుణ లు మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో మంత్రి సుభాష్, కూటమి ప్రభుత్వం చొరవతో రామచంద్రపురం నియోజవర్గంలో పలు అభివృద్ధి పనులు జరిగాయని సభలో వివరించారు.

ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ సీనియర్ నాయకులు చింతపల్లి వీరభద్రరావు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పెంకె అన్నపూర్ణ, బీసీ సెల్ రాష్ట్ర నాయకులు పెంకే సాంబశివరావు, కే గంగవరం మండల అధ్యక్షులు మేడిశెట్టి రవికుమార్, కాజులూరు మండల అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి, పిఎసిఎస్ చైర్మన్ ముప్ప నపల్లి గణేష్, ఆకేటి కృష్ణ, బొండా వెంకన్న, బుచ్చిరాజు, ద్రాక్షారామంసర్పంచ్ కొత్తపల్లి అరుణ, రామచంద్రపురం రూరల్ మండల టిడిపి అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనుబాబు, విద్యుత్ శాఖ ఈ ఈ కే రత్నాలు రావు, ఈ ఈ టెక్నికల్ విజయానంద్,ఏ ఈ వెంకటరమణ, పలువురు అధికారులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button