అలెర్ట్: ఏపీలో రాగల 3 గంటల్లో భారీ వర్షాలు..!
ఈ జిల్లాలలో రాగల 3 గంటల్లో వాతావరణం మార్పులు జరగనున్నాయి..!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తాజా వాతావరణ హెచ్చరిక జారీ చేసింది.ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఏలూరు, మరియు తిరుపతి జిల్లాల్లో రాగల 3 గంటల్లో వాతావరణం మారనుంది.
హెచ్చరిక: ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.



