గ్యాస్ ఏజెన్సీ(గోదాం)లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్…గ్యాస్ కొరత ఉందని తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.అనిల్ కుమార్,

మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, మార్చి, 19(నిజం న్యూస్ )
బుధవారం మహబూబాబాద్ పట్టణంలోని రైల్వే గేట్ ప్రాంతం హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ, మల్యాల లోని శ్రీధర ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ లను ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు,

ఈ సందర్భంగా గోదాములోని నిలువ ఉన్న గ్యాస్ వివరాల రిజిస్టర్, డెలివరీ రిజిస్టర్స్, ఆన్లైన్ లో వచ్చిన వారి జాబితా వివరాలను తనిఖీ చేశారు,

ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లాలో పకడ్బందీగా గ్యాస్ సరఫరా చేయాలని, డబుల్ సిలిండర్లు తీసుకున్న వారిని గుర్తించాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సరఫరాను కొనసాగించాలని, విజిలెన్స్ కమిటీ సభ్యులు నిత్యం జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీలలో పంపిణీ జరుగుతున్నటువంటి ప్రక్రియలు పరిశీలించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు,

నిబంధనలకు విరుద్ధంగా సరఫరా చేస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్ లను గుర్తించి కేసముద్రం మండలం ఉప్పరపల్లి లో డొమెస్టిక్ గ్యాస్, హెచ్పి, భారత్, ఇండియన్, తదితరులపై నాలుగు కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు

ప్రస్తుతం డిమాండ్కు అనుగుణంగా జిల్లాలో గ్యాస్ నిల్వలు ఉన్నాయని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

అనవసరంగా ముందస్తు గ్యాస్ బుకింగ్ లు చేయరాదని, గవర్నమెంట్ సూచించిన ప్రకారం 25 రోజుల తర్వాతనే గృహ అవసరాల నిమిత్తం గ్యాస్ బుక్ చేసుకోవాలని తెలిపారు.

గ్యాస్ కొరత ఉందని తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు,
ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరారు.

మహబూబాబాద్ పట్టణంలోని రైల్వే గేట్ ప్రాంతంలో ఉన్న హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీతో పాటు మల్యాల గ్రామంలోని శ్రీధర ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా గోదాముల్లో నిల్వ ఉన్న గ్యాస్ సిలిండర్ల వివరాలు, రిజిస్టర్ నమోదు, డెలివరీ రికార్డులు, ఆన్‌లైన్ బుకింగ్ జాబితాలను పరిశీలించారు.

ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం జిల్లాలో గ్యాస్ సరఫరా పకడ్బందీగా కొనసాగాలని సూచించారు.డబుల్ సిలిండర్లు తీసుకున్న వినియోగదారులను గుర్తించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా నిర్వహించాలని ఆదేశించారు.

విజిలెన్స్ కమిటీ సభ్యులు జిల్లాలోని అన్ని ఏజెన్సీల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు.

నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ సరఫరా చేస్తున్న వారిపై కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో గృహ వాడక గ్యాస్ సిలిండర్లకు సంబంధించి హెచ్‌పీ, భారత్, ఇండియన్ గ్యాస్ సంస్థలపై నాలుగు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

జిల్లాలో డిమాండ్‌కు అనుగుణంగా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అవసరం లేకుండా ముందస్తుగా గ్యాస్ బుకింగ్ చేయవద్దని, గృహ అవసరాల కోసం 25 రోజుల తర్వాత మాత్రమే బుకింగ్ చేయాలని సూచించారు.

గ్యాస్ కొరతపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ఉండాలని కోరారు.

 

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button