రాబోయే మ్యాచ్‌లలో నావంతు సహకారం అందిస్తా…అభిషేక్ శర్మ

భారత్ సీనియర్ ప్లేయర్ సునీల్ గవాస్కర్ నెదర్లాండ్స్ తో మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగిన కార్యక్రమంలో అభిషేక్ శర్మను మూడు మ్యాచ్‌లు, మూడు డకౌట్‌లు. నీ, మీ జట్టు ప్రదర్శనను ఎలా అంచనా వేస్తారు? అని అడగగా దానికి అభిషేక్ శర్మ ఇలా సమాధానమిచ్చాడు.
అవును, ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు నేను సరైన విధంగా ప్రదర్శన ఇవ్వలేకపోయాను. కానీ ఒక జట్టుగా, మేము బాగా రాణిస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాము. రాబోయే మ్యాచ్‌లలో నావంతు సహకారం అందించడానికి నేను ఎదురు చూస్తున్నాను అని తెలిపాడు.
నా బ్యాటింగ్ విషయానికొస్తే, రోహిత్ శర్మ గతంలో T20 WCలో ఎంత వైఫల్యం చెందాడో మనందరికీ తెలిసిందే కదా. రోహిత్ 7–8 T20 WC మ్యాచ్ లలో వైఫలం చెందాడు. అయితా తిరిగి రోహిత్ ఫాంలోకి వచ్చి వరల్డ్ కప్ ను మనకు ఇచ్చాడు. 7–8 T20 WCలో రోహిత్ విఫలమవుతూనే ఉన్నప్పుడు మనమందరం టీవీలో చూసి త్వరలోనే ఫాంలోకి వస్తాడు. రోహిత్ ఫాంలోకి వస్తే ఎలా ఉంటుందని అనుకున్నాం నేను కూడా అలానే అనుకుంటున్నానని తెలిపాడు.
