మూడు వరుస డక్ అవుట్లు.. అయినా నెంబర్ వన్ స్థానమే

3 సార్లు వరుసగా డకౌట్ అయినప్పటికీ అభిషేక్ శర్మ మాత్రం 891 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు

3 సార్లు వరుసగా డకౌట్ అయినప్పటికీ అభిషేక్ శర్మ మాత్రం 891 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.

ఐసీసీ ప్రకటించిన టి20 ర్యాంకింగ్స్ జాబితాలో మొదటి స్థానంలో అభిషేక్ శర్మ ఉండగా రెండో స్థానంలో ఇంగ్లండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ 808 పాయింట్లతో ఉన్నాడు. శ్రీలంక బ్యాటర్ నిస్సాంక ఆస్ట్రేలియాపై శతకంతో మూడో స్థానానికి ఎగబాకడు.

 భారత్ తరఫున టాప్-10లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నారు.  న్యూజిలాండ్, పాకిస్తాన్ లపై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతో ఎనిమిదో స్థానానికి ఇషాన్ కిషన్ ఎగబాకాడు.

బౌలర్లలో వరుణ్ అగ్రస్థానం..

ఐసీసీ బౌలింగ్ జాబితాలో భారత్ స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.  భారత బౌలర్లలో అక్షర్ పటేల్(14), బుమ్రా (15), అర్ష్‌దీప్ సింగ్ (16) స్థానాల్లో ఉన్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button